»   » రాజమౌళి నన్ను భయపెట్టారు..వణికిపోయాను

రాజమౌళి నన్ను భయపెట్టారు..వణికిపోయాను

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి సార్ నన్ను భయపెట్టారు..వణికిపోయాను అంటోంది తమన్నా. రాజమౌళి..వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. బాహుబలి సమయంలో తను చాలా భయపడ్డానని ప్రమోషన్ లో భాగంగా కలిసి మీడియాతో అంటోంది తమన్నా. తమన్నా...ఈ చిత్రంలో అవంతక గా కనపడనుంది. ఆమె పాత్ర పోషణలో భాగంగా..కత్తులు పట్టుకోవటం...గుర్రపు స్వారీ చెయ్యాల్సి వచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


తమన్నా మాట్లాడుతూ..రాజమౌళి గారు నన్ను కత్తి యుద్దం చేయాలి అని అడిగారు. నాకు వణుకు వచ్చింది. అప్పుడు ప్రబాస్ సాయిం చేసాడు. అలాగే తాను వర్షంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా ఇబ్బంది ఫీలయ్యానని, ఎప్పుడు పేకప్ చెప్తారా అని ఆ పదం కోసం ఎదురుచూసానని చెప్పుకొచ్చింది. అయితే అదంతా తమనుంచి అద్బుతమైన పనితనం రాబట్టుకునేందుకు రాజమౌళి చేసే ప్రయత్నమని చెప్పుకొచ్చింది.


ఫైనల్ అవుట్ పుట్ చూసిన తాము చాలా హ్యాపీ ఫీలయ్యామని, ఆ కష్టం అంతా మర్చిపోయామని చెప్తోంది. రాజమౌళి రాత్రిబవళ్లు కష్టపడి ఈ చిత్రాన్ని ఎ ఎపిక్ లా తీర్చిదిద్దుతున్నారని పొగడ్తల్లో ముంచెత్తింది. ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేసింది.


Baahubali : When Rajamouli scared Tamanna

అవంతిక పాత్ర విషయానికి వస్తే...


'ఆమె అందం ఓ రహస్యం'... అంటూ 'బాహుబలి'లో ఓ ప్రధాన పాత్రధారి తమన్నా గురించి రాసుకొచ్చారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఆయన దర్శకత్వం వహిస్తున్న 'బాహుబలి' చిత్రంలో ముఖ్య పాత్రధారుల పోస్టర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమన్నా పోషిస్తున్న అవంతిక పాత్రకు సంబంధించిన కొత్త పోస్టరును ని విడుదల చేశారు. ఆ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది.


'అందాల శక్తి' అంటూ ఆ పాత్ర తీరుతెన్నులు వివరించారు రాజమౌళి. ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. ఎం.ఎం.కీరవాణి స్వరాలందిస్తున్నారు.
కేన్స్ లోనూ...


రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి'. ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా పతాకంపై ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా జులై 10న 3500 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రచారాన్ని చిత్ర యూనిట్ వినూత్నంగా నిర్వహిస్తోంది.


ఇందులో భాగంగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు పరిచయం చేయడానికి కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని వేదికగా చేసుకొంది. శోభు యార్లగడ్డ, ఛాయాగ్రాహకుడు కె.కె.సెంథిల్‌కుమార్‌, ఎస్‌.ఎస్‌.కార్తికేయ ఆధ్వర్యంలో ఓ బృందం కేన్స్‌కు వెళ్లింది. అక్కడ కేన్స్‌ ప్రతినిధి క్రిస్టియన్‌ జేన్‌ను కలిశారు.


ఈ సందర్భంగా శోభు యార్లగడ్డ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ''బాహుబలి' రెండు భాగాలు కలిపి 290 నిమిషాల నిడివి ఉంటుంది. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం సినిమా నిడివి తగ్గించి విడుదల చేస్తాం. ఈ సినిమాను భారతీయ పురాణాల నేపథ్యంలో తెరకెక్కించలేదు. ఇది పూర్తిగా కొత్త కథ'' అని చెప్పారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రచారం కోసం ఫ్రంట్‌నైట్‌ సంస్థ అధిపతి ఫ్రాంకోయిస్‌ డ సిల్వాను తమ బృందంలో కలుపుకొంది చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా.

English summary
Tamanna says he scared her a lot while shooting for his upcoming film Bahubali. Tamanna is seen as Princess Avantika and she will be wielding swords and horse riding too. She says when Rajamouli asked to do sword fight, she experienced shivers but Prabhas helped her.
Please Wait while comments are loading...