»   » సౌత్‌ఈస్ట్ ఆసియాలో భారీగా విడుదలవుతున్న ‘బాహుబలి’

సౌత్‌ఈస్ట్ ఆసియాలో భారీగా విడుదలవుతున్న ‘బాహుబలి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ బిగ్గోస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి' డొమెస్టిక్ బాక్సాఫీసు వద్ద సృష్టించిన సంచలనం, కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు. అమెరికాతో పాటు పలు ఇతర దేశాల్లోనూ ఈ చిత్రం వసూళ్లు కుమ్మేసింది. తాజాగా ఈ చిత్రం ఇతర ఆసియా దేశాల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

బాహుబలి చిత్రాన్ని చైనాతో పాటు జపాన్ లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని ఈ రెండు దేశాలతో పాటు ఏడు సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల సౌత్ కొరియాలో జరిగిన బుసన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఎం.వి.పి ఎంటర్టెన్మెంట్స్ సంస్థతో నిర్మాత శోభు యార్లగడ్డ డీల్ కుదుర్చుకున్నాడు.


Baahubali will release in 7 countries in Southeast Asia

‘బాహుబలి-ది బిగినింగ్' చిత్రాన్ని ఇండోనేషియా, థాయిలాండ్, వియత్నాం, లవోస్, కాంబోడియా, మయన్మార్, ఈస్ట్ తిమోర్ దేశాల్లో ఎం.వి.పి ఎంటర్టెన్మెంట్స్ వారు విడుదల చేయబోతున్నారు. త్వరలోనే బాహుబలి చిత్రాన్ని లాటిన్ అమెరికా దేశాల్లోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


బాహుబలి మూవీ తెలుగు సినిమా చరిత్రలోనే కాదు... ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలనం. ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్లో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషల్లో కలిపి ఈ చిత్రం దాదాపు 650 కోట్లు వసూలు చేసిన అందరినీ ఆశ్చర్య పరిచింది. తాజాగా ఈ చిత్రాన్ని ఇతర దేశాల్లో విడుదల చేయడం ద్వారా కనీసం మరో రూ. 100 కోట్ల వసూలు అవుతాయని భావిస్తున్నారు.

English summary
Rajamouli's Baahubali will release in 7 countries in Southeast Asia.
Please Wait while comments are loading...