»   » ప్రభాస్,రానా, తమన్నా...వీళ్లంతా దుబాయ్ కు

ప్రభాస్,రానా, తమన్నా...వీళ్లంతా దుబాయ్ కు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: గామా-2015 పురస్కారాలకు కొత్త స్థాయిని, గౌరవాన్ని కల్పించేలా ‘మూవీ ఆఫ్‌ ది ఇయర్‌' పురస్కారాన్ని అందజేయాలని సంకల్పించారు. తొలిసారిగా అందజేస్తున్న ఈ అవార్డుకు ‘బాహుబలి' చిత్రం ఎంపికైంది. తమ చిత్రం ఎంపికపట్ల నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనిలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

దుబాయ్‌లోని తెలుగువారి ఆధ్వర్యంలో గల్ఫ్‌ మ్యూజిక్‌ అవార్డ్స్‌ (గామా) ప్రదానోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 12న దుబాయ్‌లోని జబీల్‌పార్క్‌ వేదికగా నిర్వహించనున్నారు. అవార్డుల ప్రదానోత్సవానికి అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అవార్డ్ లు తీసుకోవటానికి రాజమౌళి,ప్రభాస్,రానా, తమన్నా ఇలా టీమ్ అంతా దుబాయ్ ప్రయాణం కట్టనున్నారు.


Baahubali Wins Gama Awards Movie Of The Year 2015

గామా అవార్డుల ఛైర్మన్‌ కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ..... 2015 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుంచి ఉత్తమ సంగీత, గాయని, గాయకుడు, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, గీత రచయిత విభాగాల్లో అవార్డులను అందజేయనున్నారు. అవార్డుల ఎంపిక కమిటీకి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఛైర్మన్‌గా సంగీత దర్శకులు కోటి, గాయకుడు మనో, సినీగీత రచయిత చంద్రబోస్‌ సభ్యులుగా ఉన్నారు.


గామా జీవన సాఫల్య పురస్కారం - 2015 రెబల్‌స్టార్‌ కృష్ణంరాజుకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసినట్లు గామా ఇండియా ప్రతినిధి ఫణిమాధవ్‌ తెలిపారు.

English summary
Baahubali wins Gama Awards Movie Of The Year 2015. Gama Tollywood Music Awards 2015 event is going to be held at Dubai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu