»   »  ఇండియా రికార్డ్ : బాహుబలి దెబ్బకు సూపర్ స్టార్లంతా ఔట్!

ఇండియా రికార్డ్ : బాహుబలి దెబ్బకు సూపర్ స్టార్లంతా ఔట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' మూవీ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఇప్పటి వరకు బాక్సాఫీసు వద్ద రికార్డులు అంటే సౌత్ లో రజనీకాంత్, బాలీవుడ్లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి హీరోలు మాత్రమే. ఈ స్టార్ల సినిమాలే ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీసును శాసిస్తూ వచ్చాయి.

Baahubali world wide collection

అయితే తాజాగా విడుదలైన ‘బాహుబలి' మూవీ ఈ స్టార్లందరినీ వెనక్కు నెట్టేసింది. బాహుబలి మూవీ తొలి రోజు తెలుగు, తమిళం, హిందీ, మళయాలం వెర్షన్లలో కలిపి దాదాపు 4వేల థియేటర్లలో విడుదలైన ఈచిత్రం రూ. 50 కోట్లపై చిలుకు బిజినెస్ చేసింది. ఇండియన్ సినీ చరిత్రలో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్ సాధించిన సినిమాగా చరిత్రకెక్కింది. ప్రముఖ బాలీవుడ్ మూవీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాలను వెల్లడిస్తూ ట్వీట్ చేసారు.
తొలి రోజే కలెక్షన్ ఈ రేంజిలో ఉదంటే ఈ చిత్రం బిజినెస్ పూర్తయ్యే వరకు ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందో ఊహకు అందని విధంగా ఉంది. అన్ని వెర్షన్లు కలిపితే భారీ వసూళ్లు ఖాయమని అంటున్నారు. అదే జరిగితే ‘బాహుబలి' సినిమా చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.


రాజమౌళి అండ్ టీం గత రెండు మూడేళ్లుగా పడ్డ కష్టానికి తగిన ఫలితాలు వస్తుండటంతో అంతా ఆనందంగా ఉన్నారు. ‘బాహుబలి' సినిమా తెలుగు సినిమా స్టాండర్డ్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని నిరూపించారని సినిమా చూసిన వారు కొనియాడుతున్నారు.


English summary
Baahubali world wide collection details.
Please Wait while comments are loading...