వాళ్లతో ‘బాహుబలి’ లాంటి సినిమా చేయడం కష్టం: రాజమౌళి
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా రిలీజ్ అయి దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్, తమిళం కలిపి ఈ చిత్రం దాదాపు రూ. 600 కోట్లు వసూలు చేసింది.
బాలీవుడ్ స్టార్లు లేక పోయినా ఈ సినిమా హిందీలో భారీ వసూళ్లు సాధించింది. అదే బాలీవుడ్ స్టార్లతో ఈ సినిమా చేసి ఉంటే ఓవరాల్ వసూళ్లు వెయ్యి కోట్లు దాటేవనే వాదన ఉంది. ఈ విషయమై తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

'బాహుబలి-ది బిగినింగ్' సినిమా మొదలు పెట్టేనాటికే నా వద్ద స్క్రిప్టు, షెడ్యూల్ రెడీగా ఉంది. నాకు కావాల్సింది ఇందులో నటించే వాళ్లు రెండేళ్లు డేట్స్ ఇవ్వడం. బాలీవుడ్ స్టార్స్ ఎవరూ ఎలాంటి కమిట్మెంట్స్ లేకుండా రెండేళ్లు డేట్స్ ఇవ్వగలరా? అది జరిగే పని కాదు. అందుకే సినిమాకు తగినన్ని డేట్స్ ఇచ్చే స్టార్లను ఎంపిక చేయడం జరిగింది' అన్నారు.
ప్రస్తుతం తెరకెక్కుతున్న రెండో పార్ట్ బాహుబలి-ది కంక్లూజన్ మూవీలో కూడా బాలీవుడ్ స్టార్లు ఎవరూ లేరని రాజమౌళి తెలిపారు. ఈ సినిమాను 2017లొ ప్రేక్షకులను తెస్తున్నట్లు తెలిపారు. తొలి భాగం కంటే రెండో భాగం మరింత ఆసక్తికరంగా ఉంటుందని రాజమౌళి స్పష్టం చేసారు.


Click it and Unblock the Notifications











