పవన్ కల్యాణ్ డైనమేట్.. ఆయనకు అది అక్కర్లేదు.. విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

పాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ మనసులో ఒకటి.. బయటకు మరోటి చెప్పడం రాని ముక్కుసూటి వ్యక్తి. తన కథల్లోనే కాదు.. మాట్లాడే మాటల్లోనూ నిజాయితీ కనిపిస్తుంటుంది. తాజాగా కమెడియన్ అలీతో ఓ ఇంటర్వ్యూలో స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ పలు విషయాలను మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పవర్ స్టార్‌ గురించి విజయేంద్ర ప్రసాద్ తాజాగా, గతంలో చెప్పిన విషయాలు ...

Recommended Video

RRR Movie Streaming Details, బిజినెస్ 1200 కోట్ల పైనే || Filmibeat Telugu
పవన్ కల్యాణ్ సినిమా చేయాలని...

పవన్ కల్యాణ్ సినిమా చేయాలని...

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్‌కు పవన్ కల్యాణ్ ఇమేజ్, స్టామినాను పలు సందర్భాల్లో తమ మాటల్లో వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలనే కోరికను కూడా బయటపెట్టారు. అయితే సమయం కలిసి రాక సినిమాలు తీయలేకపోయాం. ఛాన్స్ లభిస్తే తప్పకుండా సినిమా తీస్తాం అని చెప్పారు.

బాహుబలి ఇంటర్వెల్‌ సీన్‌కు స్పూర్తి

బాహుబలి ఇంటర్వెల్‌ సీన్‌కు స్పూర్తి

ఇక ప్రపంచస్థాయి పాపులారిటీని సంపాదించిన బాహుబలి 2 సినిమాలోని ఇంటర్వెల్ సీన్‌కు పవన్ కల్యాణ్ స్పూర్తి అని చెప్పకనే చెప్పారు. చిరంజీవి పాల్గొన్న సభలో పవన్ కల్యాణ్ గురించి అభిమానులు హోరెత్తిన సందర్భమే బాహుబలి2 ఇంటర్వెల్ కారణం అని చెప్పారు.

పవర్ స్టార్ సినిమాకు కథ అవసరం లేదు..

పవర్ స్టార్ సినిమాకు కథ అవసరం లేదు..

తాజాగా పవన్ కల్యాణ్ గురించి కమెడియన్ అలీ అడిగిన ప్రశ్నకు రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... పవర్ స్టార్ సినిమాకు కథ రాయనక్కర్లేదు. ఆ సినిమాలో నాలుగైదు సీన్లు అక్కడక్కడ పెడితే చాలూ. కథ అయిపోతుంది అని విజయేంద్ర ప్రసాద్ అంటే.. అదేమిటండి అని అలీ ఆశ్చర్య పోయారు.

ప్రేక్షకులకు అది అవసరం లేదు..

ప్రేక్షకులకు అది అవసరం లేదు..

పవన్ కల్యాణ్ సినిమాను చూడటానికి వచ్చిన వారికి కథపై పట్టింపు అవసరం లేదు. అమ్మాయిలతో పాటలు పాడాలి.. హీరోయిన్లతో డ్యాన్సులు చేయాలి.. విలన్లను చితక్కొట్టాలి. ప్రేక్షకులకు నాలుగు మంచి మాటలు చెబితే చాలూ అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

 పవన్ కల్యాణ్ డైనమేట్ లాంటి వారు

పవన్ కల్యాణ్ డైనమేట్ లాంటి వారు

పవన్ కల్యాణ్ డైనమేట్ లాంటి వారు. ఆయనకు చిన్న అగ్గిపుల అంటిస్తే చాలూ.. ఆయన సినిమాకు పెద్దగా కథ అక్కర్లేదు. కథ గురించి పెద్దగా ఆలోచించనక్కర్లేదు. నాలుగు సీన్లు ఉంటే చాలూ అంటూ పవన్ కల్యాణ్ స్టామినా గురించి విజయేంద్ర ప్రసాద్ చెప్పగానే ఆలీ ఆశ్చర్యపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X