‘పవన్ కల్యాణ్ లాంటి లీడర్ ఉండటం ఏపీ ప్రజల అదృష్టం.. ప్రజాసేవ పేరుతో నేతల దోపిడి’
పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బాహుబలి రైటర్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటే దోచుకోవడం, దాచుకోవడంగా మారింది. అలాంటి తరుణంలో గొప్ప నేతగా పవన్ కల్యాణ్ కనిపించాడు అని ఆయన అన్నాడు. హైదరాబాద్‌లో మహా టెలివిజన్ కొత్తగా ప్రారంభించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ మహా మ్యాక్స్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, విజయేంద్ర ప్రసాద్, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..
దుర్గామాత దర్శనం కోసం ఎంతో మంది భక్తులు విజయవాడకు వెళ్తున్నారు. అలాంటి వారికి రోడ్డు పక్కన పవన్ కల్యాణ్ అభిమానులైన ముస్లిం యువకులు దుర్గమాత భక్తులకు మజ్జిగను అందిస్తూ కనిపించారు. ఆ సంఘటన చూసి మనసు ఎంత ముచ్చటపడిందో మాటల్లో చెప్పలేను. నేను చాలా సంతోషంగా ఫీలయ్యాను. ఆ సంఘటన నా హృదయాన్ని వెంటాడుతున్నది. ఇదే పని మళ్లీ మళ్లీ దుర్గమ్మ పండుగ సమయంలో జరగాలని మనసులో కోరుకొన్నాను అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

దేశంలో ముస్లింల పండగ కోసం హిందువులు సాయపడితే.. అలాగే హిందువుల పండగ కోసం ముస్లింలు సాయం చేస్తే అంతకంటే గొప్ప అదృష్టం ఈ దేశానికి ఉండదు. అలాంటి మతసామరస్యం దేశంలో విరసిల్లడానికి ఒక లీడర్ కావాలి. ఆ లీడర్‌కు చిత్తశుద్ది ఉండాలి. రాజకీయాల్లో పదవి అనేది దోచుకోవడానికి, దాచుకోవడానికి ఉండకూడదు. పదవి అనేది ప్రజా సేవ కోసమే అనే చెప్పే మనిషి కావాలి అని ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

నేటి తరం రాజకీయాల గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఏం మాట్లాడుతారో.. ఏం ఆలోచిస్తూ ఏం మాట్లాడుతారో అనే విధంగా ఒక నీతి, నిజాయితీ కల లీడర్ కావాలి. మన అదృష్టం కొద్ది మనకు పవన్ కల్యాణ్ లాంటి లీడర్ దొరికాడు అని పవన్ కల్యాణ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. మత సామరస్య కోసం పాటుపడే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు.
విజయేంద్ర ప్రసాద్ తన ప్రసంగం మధ్య పవన్ కల్యాణ్‌కు సలహా ఇస్తూ.. మీరంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు. మీ కోసం పాటుపడే జనసైనికులు ఉన్నారు. వారందరిని మత సామరస్యం కోసం కృష్టి చేయాలని చెప్పండి. అలాంటి పని చేయడానికి అవకాశం, అదృష్టం మీకు ఉన్నాయి. మీరు కార్యాన్ని మీ భుజాల మీదకు ఎత్తుకోండి. మా వంతుగా మీకు పరిపూర్ణమైన ఆయుష్పును, ఆరోగాన్ని ఇస్తాం అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.


Click it and Unblock the Notifications











