twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పీకే, దంగల్ రికార్డులకు బాహుబలి ముప్పు.. బాక్సాఫీస్‌ను కుదిపేయడం ఖాయమట..

    బాహుబలి ది కన్‌క్లూజన్‌ వసూళ్ల పరంగా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.

    By Rajababu
    |

    బాహుబలి2 ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభిస్తున్నది. సోషల్ మీడియా, యూట్యూబ్ చానెళ్ల రికార్డులను తిరగరాసున్నది. కేవలం ట్రైలర్‌కే భారీగా స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించడం ఖాయమనే అభిప్రాయాన్ని ట్రేడ్ అనలిస్టులు, సినీ విమర్శకులు వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు ముందే రూ.500 కోట్లకు పైగా బిజినెస్ చేసిన బాహుబలి ది కన్‌క్లూజన్‌ వసూళ్ల పరంగా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.

    వందేళ్ల చరిత్రలో బాలీవుడ్‌దే..

    వందేళ్ల చరిత్రలో బాలీవుడ్‌దే..

    వందేళ్ల సినిమా చరిత్రలో ఇప్పటివరకు పీకే, దంగల్, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాలతో అగ్రస్థానం. అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.792 కోట్లు, దంగల్ రూ.744 కోట్లు వసూలు చేసి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మూడోస్థానంలో భజ్‌రంగీ భాయ్‌జాన్ రూ.626 కోట్లు, సుల్తాన్ రూ.589 కోట్లు, ధూమ్ రూ.558 కోట్లు, చెన్నై ఎక్స్ ప్రెస్ రూ.422 కోట్ల వసూళ్లను రాబట్టాయి. ఈ చిత్రాలన్నీ బాలీవుడ్‌కు చెందినవే.

    బాహుబలి1‌కు అంతర్జాతీయ ఆదరణ

    బాహుబలి1‌కు అంతర్జాతీయ ఆదరణ

    సినిమా పరిశ్రమను బాలీవుడ్‌ చిత్రాలు ఏలుతున్న నేపథ్యంలో ప్రాంతీయ చిత్రంగా విడుదలైన బాహుబలి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమపై ప్రత్యేక దృష్టిని ఆకర్షించేలా దర్శకుడు రాజమౌళి సఫలమయ్యారు. అందరి అంచనాలు పటాపంచాలు చేస్తూ బాహుబలి చిత్రం దాదాపు రూ.600 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఓ ప్రాంతీయ చిత్రం ఇంతమొత్తంలో కలెక్షన్లను కొల్లగొట్టడం ఇదే తొలిసారి.

    బాహుబలి2పై పెరిగిన ఆసక్తి

    బాహుబలి2పై పెరిగిన ఆసక్తి

    బాహుబలి సినిమా సాధించిన అనూహ్య విజయంతో తాజాగా బాహుబలి ది కన్‌క్లూజన్‌పై ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా రఫ్ ఆడించేస్తున్నది. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా యూట్యూబ్‌లో అలజడి రేపుతున్నది. ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో హిట్స్ రావడంతో బాహుబలి2 రేంజ్ మరింత పెరిగింది. భారీ అంచనాలు పెరిగాయి.

    బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..

    బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..

    బాహుబలి ది బిగినింగ్ చూసిన తర్వాత ప్రతీ ఒక్కరిని ఒక ప్రశ్న వెంటాడుతున్నది. ఎంతో ఆప్యాయతతో పెంచిన బహుబలిని కట్టప్ప ఎందుకు చంపారన్నది అన్ని వర్గాల ప్రజలకు ప్రశ్నగా మిగిలింది. ఈ అంశం బాహుబలి2 చూడాలనే మరింత క్యూరియాసిటిని పెంచింది.

    అసలు కథ బాహుబలి2లోనే..

    అసలు కథ బాహుబలి2లోనే..

    బాహుబలి1 చిత్రంలో పాత్రలను పరిచయం చేసే సరికే మొదటి భాగం సరిపోయింది. మాహిష్మతి సామ్రాజ్యంలో అంతర్గత యుద్ధం రావడానికి కారణం ఏమిటో అనే సందేహం ప్రేక్షకుల మదిలో గత రెండేళ్లుగా నానుతున్నాయి. ప్రభాస్, అనుష్కల పాత్రలకు మొదటి భాగంలో అంతగా ప్రాధాన్యం లేదు. రెండో భాగంలోనే అసలు కథ మొదలు కానున్న నేపథ్యంలో బాహుబలి2 ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

    మెరుగైన గ్రాఫిక్స్ టెక్నాలజీ

    మెరుగైన గ్రాఫిక్స్ టెక్నాలజీ

    గతంలో పిరియాడికల్ ఫిలింస్ అంటే హాలీవుడ్ గుర్తొచ్చింది. గ్రాఫిక్స్, టెక్నికల్ వ్యాల్యూస్ సినిమాలకు ఇంగ్లీష్ సినిమాలే అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండేది. అలాంటి అభిప్రాయాన్ని తుడిచిపెట్టేలా చేసింది బాహుబలి. బాహుబలిలో తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాలు. గ్రాఫిక్స్ టెక్నాలజీ ప్రేక్షకుడిని అమాంతం కట్టిపడేసింది.

    వేసవిలో పిల్లలకు ఆట విడుపు

    వేసవిలో పిల్లలకు ఆట విడుపు

    బాహుబలి2 విడుదలయ్యే సమయానికి స్టూడెంట్స్‌కు దాదాపు పరీక్షలు ముగిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సమయంలోనే బాహుబలి రావడం వల్ల పిల్లలకు కూడా ఆ చిత్రాన్ని చూడాలనే ఉత్సాహం కలుగడం సహజం. దాంతో కుటుంబం మొత్తం థియేటర్స్‌కు వెళ్లే అవకాశం ఏర్పడుతుంది.

    అన్నివర్గాల ప్రజల ఆసక్తి

    అన్నివర్గాల ప్రజల ఆసక్తి

    కొందరు కొన్ని రకాల సినిమాలనే ఇష్టపడుతారు. కొందరు కుటుంబ కథ చిత్రాలను ఇష్టపడితే.. మరికొందరు సస్పెన్స్, థ్రిలర్స్, ఇంకొందరు ప్రేమ కథలను ఇష్టపడుతారు. కానీ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్న చిత్రంగా బాహుబలి నిలిచింది. అందుకే ఆ చిత్రం ప్రభంజనం సృష్టించింది. బాహుబలికి సీక్వెల్‌గా వస్తున్న బాహుబలి2ని అన్నివర్గాలు ఇష్టపడే అవకాశం ఉంది.

    పీకే, దంగల్ చిత్రాలకు చెక్

    పీకే, దంగల్ చిత్రాలకు చెక్

    బాహుబలిని ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో ఇక బాహుబలి పీకే, దంగల్ చిత్రాల రికార్డులను తిరగరాస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో బాహుబలి2 విడుదల కానున్నది. ఈ చిత్రం రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల మధ్య వసూళ్లను రాబట్టే అవకాశముందనే ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

    బాహుబలి1 జూలై 10, 2015లో విడుదలైంది.

    బాహుబలి1 జూలై 10, 2015లో విడుదలైంది.

    అంటే దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత బాహుబలి2 ప్రేక్షకుల ముందుకు రానున్నది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నది. దేశవ్యాప్తంగా సగటు సినీ ప్రేక్షకుడే కాకుండా రాజకీయ వర్గాలు కూడా ఈ చిత్రం ఎదురుచూస్తున్నారు.

    English summary
    After huge response to trailer, Baahubali2 is preparing to hit the PK, Dangal Records. This movie mania growing day by day. In this situation there is high expectations on Baahubali2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X