‘బాహుబలి 2’ టీజర్ గురించి అఫీషియల్ గా ...

By Srikanya

హైదరాబాద్ : మొన్న శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం సెకండ్ పార్ట్ గురించి అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. దానికి తోడు... బాహుబలి మేకర్స్ ..రెండు రోజుల క్రితం ...కొన్ని ఎడిషనల్ సీన్స్ కలిపి...ప్రేక్షకుల కన్ఫూజన్ తొలిగించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా అర్దాంతరంగా ముగిసిన ముగింపుని జస్టిఫై చేయాలనుకున్నారు.

అందునిమిత్రం..అఫీషియల్ గా పీఆర్ వాళ్లు ట్వీట్ సైతం చేసారు. "Teaser Shots from Part 2 have been added post credits in #Baahubali... They have been added to all QUBE prints," . అయితే ...సెన్సార్ బోర్డ్ ఆపీసర్ మాత్రం... మా దగ్గరకి ...కొత్త సీన్లు యాడ్ చేయటానికి రాలేదు అని అన్నారు.

Baahubali2 teaser shots not cleared by Censor

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

టైటిల్ తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి చిత్రం కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.

మరో ప్రక్క సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు అయిన ఫేస్ బుక్, ట్విటర్ లో 'బాహుబలి' హవా కొనసాగుతోంది. కెరీర్ లో ఇప్పటివరకు తీసిన తొమ్మిది చిత్రాలలో ఏ ఒక్కటీ ఫ్లాప్ కాలేదు. దాంతో ఈ పదో సినిమా కూడా పాజిటివ్ టాక్ తో రన్ అవటం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది.

కలెక్షన్స్ విషయానికి వస్తే...

తొలి రెండు రోజుల్లోనే వసూళ్లు రూ. 100 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. సుమారు రూ. 135 కోట్లు రాబట్టినట్టు సమాచారం. తొలిరోజు కలెక్షన్ రూ.68.5 కోట్ల నుంచి రూ.76 కోట్ల మధ్య ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది వచ్చిన షారూఖ్ ఖాన్ మూవీ 'హ్యాపీ న్యూ ఇయర్' వసూలు చేసిన రూ. 45 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్ ను 'బాహుబలి' అధిగమించాడు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్ రూ. 30 కోట్లకు పైగా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో రెండు రోజుల్లో రూ.10.25 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ లోనూ 'బాహుబలి' ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 10.50 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది.

ఓవర్ సీస్ మార్కెట్ లోనూ 'బాహుబలి' రికార్డు బద్దలు కొడుతున్నాడు. అమెరికాలో సుమారు రూ. 11 కోట్లు, ఆస్ట్రేలియాలో దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇక మూడు రోజుల వసూళ్లు రూ. 150 కోట్లుకు చేరినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X