సెప్టంబర్ 16న వస్తున్న ‘బాణం’
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు తనయుడు నారా రోహిత్‌ను హీరోగా పరిచయం చేస్తూ వేదిక కథానాయికగా చైతన్య దంతులూరిని దర్శకుడుగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ కుమార్తె శేషు ప్రియాంక చలసాని త్రీ ఏంజెల్స్ పతాకంపై నిర్మిస్తున్న 'బాణం" చిత్రం అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 16న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శేషు ప్రియాంక మాట్లాడుతూ "ఈ మధ్యే విడుదలైన మా చిత్రంలోని పాటలు ప్రేక్షకుల మధ్యకు 'బాణం" లా దూసుకుపోతున్నాయి. ఇందులోని పాటలను కేవలం తెలుగు పదాలతోనే వనమాలి, రామజోగయ్య శాస్ర్తి, కృష్ణ చైతన్యలు రాసారు. అన్ని పాటలు సందర్భోచితంగా ఉంటాయి.
మణిశర్మ అద్భుమైన సంగీతం అందించారు. మా కథానాయకుడు నారా రోహిత్ సీనియర్ హీరోలా నటించారు. నిర్మాతగా నా మొదటి చిత్రం మరపురానిదిగా ఉండాలనే ఉద్ధేశ్యంతో ఈ చిత్రాన్ని భారీగా నిర్మించడం జరిగింది. బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం, పొల్లాచ్చి, ఊటీ, అలెప్పీ, పలఖ్కడ్‌లలో షూటింగ్ చేసాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 16న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.


Click it and Unblock the Notifications











