పి.వాసు నెక్ట్స్ ... బాజీగర్ రీమేక్

By Staff

Baazigar
షారూఖ్ ఖాన్ నెగిటివ్ రోల్ చేసిన 'బాజీగర్' సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. ఆ చిత్రం ఈ సారి తమిళ ప్రేక్షకులను అలరించబోతోంది. చంద్రముఖి దర్శకుడు పి.వాసు తన తనయుడు శక్తి (అతని పేరు) కోసం ఈ సినిమాను చేయబోతున్నాడు. తాజాగా ఆయన బాజీగర్ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకున్నారు. దాదాపు పదిహేనేళ్ళ క్రిందటి నాటి ఆ సినిమా అప్పట్లో షారూఖ్ కెరీర్ కి లైఫిచ్చింది. అప్పట్లో ఆ సినిమాని దాదాపు అన్ని భాషల్లో కొందరు ఫ్రీమేక్ గానూ,మరికొందకరు రీమేక్ గానూ చేసేసారు.కాని ఎక్కడా ఆ స్ధాయి సంచలన విజయం ఎవరూ పొందలేదు. తెలుగులోనూ రాజశేఖర్ 'వేటగాడు' పేరుతో ట్రై చేసి ఫ్లాప్ కొట్టటం అందరికి గుర్తుండే విషయమే.

ఎలాంటి సబ్జెక్టుకు అయినా కమర్షియల్ టచ్ ఇచ్చి హీరోని ఎలివేట్ చేస్తాడని పి.వాసుకు గొప్ప పేరుంది. దాంతో కథా బలం గల ఈ చిత్రం తన కుమారుడు కి కరెక్టు గా సూటవుతుందని ఆయన భావిస్తున్నారు. నిజానికి ఈ సినిమా హాలీవుడ్ చిత్రం A Kiss Before Dying నుండి పుట్టింది. రివెంజ్ బేస్డ్ గా నడిచే ఆ సినిమా ఇద్దరు హీరోయిన్ల చుట్టూ కథ తిరుగుతుంది. అయినా ఒరిజనల్ చిత్రం ఉండగా మళ్ళీ చిత్రం రైట్స్ కొనటం అనవసరం అని కొందరంటున్నారు. కాని తరువాత ఏ విథమైన లీగల్ సమస్యలు రావడం తనకిష్టం లేదని ఆయన అనుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రజనీ కాంత్ తో మళయాళ చిత్రం 'కథా పెరియంబోల్'ని 'కుచేలుడు' పేరుతో రీమేక్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X