twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరో అయినా కూడా అలా చేసేవాడ్ని.. అందుకే చాన్స్‌లు లేవు.. బాబా భాస్కర్ కామెంట్స్

    |

    కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ అంటే అందరికీ ఓ ఇమేజ్ ఏర్పడింది. బాబా భాస్కర్ ఎక్కడ ఉంటే అక్కడంతా సందడే సందడి. ఆ విషయాన్ని బిగ్ బాస్ షో ద్వారా అందరూ ఫిక్స్ అయ్యారు. మామూలుగా బాబా భాస్కర్ ఇప్పుడు ఇలా ఇంత సరదాగా ఉంటున్నాడట. కానీ వర్క్ విషయానికి వస్తే మాత్రం బాబా భాస్కర్ ఎంతో సీరియస్‌గా ఉంటాడట. అలా తప్పులను పట్టి పట్టి చూడటం, పనిని సరిగ్గా చేయడంతోనే అవకాశాలు రాలేదని బాబా భాస్కర్ తాజాగా చెప్పుకొచ్చాడు.

    కోపం ఎక్కువ..

    కోపం ఎక్కువ..

    బాబా భాస్కర్ బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో కొన్ని విషయాలను చెప్పేశాడు. తనకు కోపం ఎక్కువగా వస్తుందని.. వాటి వల్లే ఎన్నో అవకాశాలను కోల్పోయానని చెప్పుకొచ్చాడు. కానీ బిగ్ బాస్ ఇంట్లో ఉన్న ఏ ఒక్క రోజు కూడా ఎవ్వరి మీదా కోపం తెచ్చుకోలేదు బాబా భాస్కర్. అంతలా మారిపోయానని చెప్పకనే చెప్పేశాడు.

    ఒకప్పుడు అలా..

    ఒకప్పుడు అలా..

    సెట్‌లోకి తాను అడుగుపెడుతుంటే అందరూ భయపడేవారు అని అంతా నిశ్శబ్దంగానే ఉండేదని, చేయాల్సిన షూటింగ్‌ను చకాచకా కానిచ్చేవాడిని అని చెప్పుకొచ్చాడు. అక్కడ స్టార్ హీరో ఉన్నా సరే తన పని తాను చేసుకుంటూ వెళ్లేవాడిని అని ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు.

    తాజాగా ఇలా..

    తాజాగా ఇలా..

    బాబా భాస్కర్ ప్రస్తుతం డ్యాన్స్ ప్లస్ షోలో ఓ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం డ్యాన్స్ ప్లష్ షోలో ఎలిమినేషన్ రౌండ్ నడుస్తోంది. పైగా తాను అడాప్ట్ చేసుకున్న కంటెస్టెంట్ నివేదిత విషయం అందరూ నిరుత్సాహ పడ్డారు. నివేదిత ఎంతో బాగా డ్యాన్స్ చేస్తున్నా కూడా కొరియోగ్రఫీలో మాత్రం కొత్తదనం లేదని సదరు మాస్టర్‌ను అందరూ టార్గెట్ చేశారు.

    చివరకు బాబా..

    చివరకు బాబా..

    బాబా భాస్కర్ కూడా స్టేజ్ మీదకు వచ్చి సదరు మాస్టర్‌ను ఏకిపారేశాడు. ఇప్పటికే నివేదిత చేసిన ఏడు పర్ఫామెన్స్‌లో నాలుగు సేమ్ అంటూ.. క్లాస్ పీకాడు. తాను కరెక్ట్‌గా తప్పులు తీయడం మొదలుపెట్టి.. రెడ్ ఇస్తే.. ఒక్కరికీ కూడా గ్రీన్ రాదంటూ తన గతం గురించి చెప్పాడు.

    చివరి వరుసలో..

    చివరి వరుసలో..

    పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసే సమయంలో.. ఆరు వరుసలో చివరి వ్యక్తి మూమెంట్ కూడా సరిగ్గా రాకపోతే మళ్లీ రీ టేక్ చేసేవాడిని.. స్టార్ హీరోలు ఉన్నా కూడా అలానే చేసేవాడిని. వాళ్లు కనిపించరు కదా? ఎందుకు మళ్లీ రీ టేక్ అని హీరోలు అనేవారు. కానీ నేను ఒప్పుకునేవాడిని.. నేను ఏది చేసినా పర్ఫెక్ట్‌గా ఉండాలి.. అలా గొడవలు పడి ఎన్నో చాన్స్‌లు పోగొట్టుకున్నాను అని బాబా భాస్కర్ చెప్పుకొచ్చాడు.

    English summary
    Baba Bhaskar ABout His Behavior On Set
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X