Don't Miss!
- News పట్టు కోల్పోయిన పవన్: వైసీపీలో మరో జనసేన సీనియర్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ముమైత్, మోనాల్, యానీ మాస్టర్లా రికార్డింగ్ డ్యాన్సులు.. మరీ దిగజారిన బాబా భాస్కర్
బాబా భాస్కర్ ఉన్నాడంటే అక్కడ ఎంటర్టైన్మెంట్కు కొదవే ఉండదని అందరూ అంటారు. అది నిజం కూడా. బిగ్ బాస్ షోలో వంద రోజులకుపైగా ఉన్నాడు. ప్రతీ రోజూ అందరినీ నవ్వించేందుకు మాత్రమే ప్రయత్నించేవాడు. మొత్తంగా బాబా భాస్కర్ ఓ రెండు మూడు సందర్భాల్లోనే ఎమోషనల్ అయ్యాడు. కన్నీరుపెట్టేశాడు. కానీ ఎప్పుడూ కూడా తన నవ్వును వదిలిపెట్టలేదు. అందరినీ నవ్విస్తూనే ఉంటాడు. కానీ ఒక్కోసారి అది వెగటుగా కూడా అనిపిస్తుండేది.
ప్రస్తుతం అక్కడా..
ప్రస్తుతం బాబా భాస్కర్ డ్యాన్స్ ప్లస్ షోలో సందడి చేస్తున్నాడు. ఓంకార్ నిర్వహిస్తోన్న ఈ షోలో ముమైత్ ఖాన్, యానీ మాస్టర్, మోనాల్ గజ్జర్, యశ్ మాస్టర్, రఘు మాస్టర్ ఇలా అందరూ కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే మధ్యలో వేసే స్కిట్లు, చేసే డ్యాన్సులు మితిమీరుతుంటాయి.
మధ్యలో అలా..
ముఖ్యంగా మోనాల్ మధ్య మధ్యలో శ్రుతి మించిపోతూ ఉంటుంది. డ్యాన్సులు, జడ్జ్‌లతో రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. వారికి తగ్గట్టుగా బాబా భాస్కర్ కూడా తన మాస్ విశ్వరూపాన్ని చూపిస్తుంటాడు. వచ్చే వారం మాస్ అండ్ ఐటం సాంగ్స్‌తో రెచ్చిపోతోన్నట్టు తెలుస్తోంది.
ముగ్గురు డ్యాన్స్..
మామా మామా అనే పాటకు మోనాల్ బాబా భాస్కర్ ఇద్దరూ కూడా రెచ్చిపోయారు. ఇక మోనాల్ అచ్చ తెలుగు మహిళగా చీరకట్టుతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ పర్ఫామెన్స్ తరువాత ముగ్గురు జడ్జ్‌లు చేసిన రికార్డింగ్ డ్యాన్స్ మాత్రం ఘోరంగా ఉంది.
రచ్చ చేసిన బాబా..
ముమైత్ ఖాన్, మోనాల్, యానీ మాస్టర్ ఇద్దరూ కూడా వెయ్ రా చెయ్ వెయ్ రా అనే పాటకు అదిరిపోయే పాటకు స్టెప్పులు వేశారు. అలా ఆ ముగ్గురు డ్యాన్స్ చేస్తుంటే.. బాబా భాస్కర్ కింద పాక్కుంటూ వెళ్లి చండాలం చేసేశాడు. మొత్తానికి బాబా భాస్కర్ అలా చేయడంతో ముమైత్ ఖాన్ షాక్ అయినట్టు కనిపిస్తోంది.
ఓంకార్ కూడా..
బావలు సయ్యా అనే పాటకు ఇద్దరూ చేసిన డ్యాన్సులపై ఓంకార్ కూడా కామెంట్ చేశాడు. డ్యాన్స్ ప్లస్ షోకు లక్ష్మిలా కనిపించే వాళ్లు.. ఇప్పుడు సిల్క్ స్మితను మించిపోయారంటూ కామెంట్ చేశాడు. మొత్తానికి డ్యాన్స్ ప్లస్ మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది.