twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ జర్నీపై బాబా భాస్కర్ ఓపెన్ కామెంట్స్.. శ్రీముఖిపై డౌట్ ఉండేదంటూ!

    |

    తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్ 3 సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచాయి. నవంబర్ 3వ తేదీన తేదీన గ్రాండ్ ఫినాలే ద్వారా బిగ్ బాస్ షోకి ముగింపు పలికారు బుల్లితెర ఆడియన్స్. స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలకడం జరిగింది.

     విన్నర్, రన్నర్.. బాబా భాస్కర్‌ రెస్పాన్స్

    విన్నర్, రన్నర్.. బాబా భాస్కర్‌ రెస్పాన్స్

    టైటిల్ విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా, రన్నరప్‌గా శ్రీముఖి నిలిచింది. శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ, రాహుల్, బాబా భాస్కర్‌ లు ఫైనల్ రేస్‌లో బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడ్డారు. అయితే ఓటింగ్ ప్రకారం గెలుపోటములు నిర్ణయించబడ్డాయి. బిగ్ బాస్ కంటిస్టెంట్లు అందరూ హౌస్ వదిలి వెళ్లారు. కాగా తాజాగా తన బిగ్ బాస్ జర్నీ గురించి బాబా భాస్కర్‌ స్పందించారు.

    హౌస్‌లో ఉన్న 15 మంది కంటిస్టెంట్స్ కోసం

    హౌస్‌లో ఉన్న 15 మంది కంటిస్టెంట్స్ కోసం

    బిగ్ బాస్ ప్రయాణం చాలా హ్యాపీగా అనిపించిందని అన్నారు. హౌస్‌లో ఉన్న 15 మంది కంటిస్టెంట్స్ కోసం దాదాపు 300 మంది బిగ్ బాస్ టీం పని చేస్తారు. రియల్లీ హాట్సాల్ఫ్ టు బిగ్ బాస్ అని అన్నారు బాబా భాస్కర్. ఈ సీజన్ అంతా ఆడాను, పాడాను, డాన్సులేశాను.. ఫుల్లుగా ఎంజాయ్ చేశాను అంటూ ఆనంద పడ్డారు ఈ కొరియోగ్రాఫర్.

    వాళ్లందరికీ పాదాభివందనం.. గర్వంగా ఉంది

    వాళ్లందరికీ పాదాభివందనం.. గర్వంగా ఉంది

    తనకు టాప్ 3 రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని చెప్పిన బాబా భాస్కర్.. తనను ఆదరించిన ప్రేక్షకులందరికీ పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. బిగ్ బాస్ 3 లో బాబా భాస్కర్ 3 లో ఉండటం గర్వంగా ఉందని చెప్పారు. ఈ బిగ్ బాస్ జర్నీలో ఇంత సమయం ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదని చెప్పారు బాబా భాస్కర్.

    ఊహించింది జరగదు.. ఆ ముగ్గురిపై డౌట్

    ఊహించింది జరగదు.. ఆ ముగ్గురిపై డౌట్

    బిగ్ బాస్ అంటేనే ఊహించింది జరగదని అన్నారు బాబా భాస్కర్. కాకపోతే తనకు రాహుల్, వరుణ్ సందేశ్, శ్రీముఖి పై డౌట్ ఉండేదని పేర్కొన్నారు. కానీ చివరకు రాహుల్ గెలిచారని.. బిగ్ బాస్ జర్నీ అనేదే ఓ అద్భుతమని ఆయన పేర్కొన్నారు.
    శ్రీ ముఖి గెలుస్తుందని చాలా కాన్ఫిడెంట్ ఉండేదని చెప్పుకొచ్చారు. ఏదేమైనా చాలా హ్యాపీగా ఉందని అన్నారు.
    బిగ్ బాస్ కొత్త అనుభవం.. ఖండించిన బాబా భాస్కర్

    బిగ్ బాస్ కొత్త అనుభవం.. ఖండించిన బాబా భాస్కర్

    బిగ్ బాస్ అనేదే కొత్త అనుభవమని అన్నారు బాబా భాస్కర్. చిన్నప్పటి నుంచీ డాన్సులు అంటూ పెరిగిన తనకు బిగ్ బాస్ కొత్త అనుభవం పంచిందని అన్నారాయన. అలాగే బిగ్ బాస్‌లో ఓ కంటిస్టెంట్‌తో క్లోజ్‌గా ఉండటం వల్ల తన ఫ్యామిలీలో గొడవలు వచ్చాయని వస్తున్న వార్తలను బాబా భాస్కర్ ఖండించడం విశేషం.

    English summary
    Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna. This season title won by Rahul Sipligunj.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X