»   » ద్యా..వ్వుడా..! ఈ దేవుడు బాబా సినిమా కోసం సైన్యాన్ని కూడా వాడేస్తున్నాడు....

ద్యా..వ్వుడా..! ఈ దేవుడు బాబా సినిమా కోసం సైన్యాన్ని కూడా వాడేస్తున్నాడు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాబా గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబా. సిక్కు మతంలోని ఒక శాఖ" డేరా సచ్చా సౌదా"కు ఈయన అధిపతి. భక్తులు యిబ్బడిముబ్బడిగా విరాళాలు ఇవ్వడంతో వాటితో డేరా అనేక స్థిరాస్తులు కొని, అనేక వ్యాపారాల్లో దిగాడు. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఆర్గానిక్ ఫామ్స్, కాలేజీలు, రిటైల్ స్టోర్సు, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, రిసార్టులు, హోటల్స్, మీడియా, క్రికెట్ స్టేడియాలు అబ్బో బాబాగారి వ్యాపార సామ్రాజ్యం అంతా ఇంతా కాదు. డేరా తన సంపదతో ప్రభుత్వాలను సైతం శాసించగలుగుతున్నాడు. 50 మంది వరకూ మహిళా భక్తురాళ్లపై అత్యాచారం చేసినట్టు ఇతనిపై ఆరోపణలు వచ్చాయి.

సినిమల్లో కూడా తన టాలెంట్ నిరూపించుకున్న ఈ "స్టార్ బాబా" ఇప్పుడు మూడో సినిమా ఇతివృత్తంగా మొన్న భారత సైన్యం చేసిన సర్జికల్ దాడిని ఎంచుకున్నాడట. సెప్టెంబర్ 18న కశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 19 మంది సైనికులు అమరులయ్యారు. దీనికి స్పందనగా భారత ఆర్మీ పీవోకేలోని తీవ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేసింది. 'తరచుగా మనం సైనికులను కోల్పోతున్నాం. ఎంతమంది దీని గురించి మాట్లాడుతున్నారు? హఠాత్తుగా కొంతమంది తెరపైకి వచ్చి సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలని అడుగుతున్నారు. ఇది నన్ను చాలా బాధించింది. ఇలాంటి వారికి నా సినిమా ద్వారా చెప్పాలనుకున్నా'నని అన్న ఈ బాబా సినిమా విశేషాలు మరికొన్ని

 డేరా సచ్ఛా సౌదా

డేరా సచ్ఛా సౌదా


ఆధ్యాత్మిక సంస్థ "డేరా సచ్ఛా సౌదా " స్థాపకుడిగా పలు సందర్భాల్లో సంచలనాలు రేపిన ఈ బాబా..."మెసేంజర్‌ ఆఫ్‌ గాడ్‌" చిత్రంతో వెండితెరపై ఓ రాయి విసిరాడు. ఇందులో హీరోగా గుర్మీత్‌ చేసిన సాహసాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. కొండంత బండరాళ్లను విసిరేయడం, బైక్‌ పై ఎగిరివెళ్లడం..ఇలా ఎన్నో సాహసాలు చేశాడు బాబా. ఇలాంటివి సినిమా చూసిన వాళ్లకు వినోదాన్ని పంచాయి. హీరోయిజంపై వ్యగ్యాస్త్రంలా తెలుగులో వచ్చిన ‘సుడిగాడు' తరహా సినిమా ఇది.

 యాక్షన్‌ విన్యాసాలు

యాక్షన్‌ విన్యాసాలు


గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ చీకట్లో వేసిన ఆ బాణం తగలడంతో ఇక వరుసగా సినిమాలు రూపొందిస్తున్నాడు. గతేడాది ‘మెసేంజర్‌ ఆఫ్‌ గాడ్‌' కు సీక్వెల్‌ సినిమా చేశాడు. ఈ సినిమాలో పైత్యం మరీ ముదిరిపోయింది. యాక్షన్‌ విన్యాసాలు ఆకాశాన్నంటాయి. రివ్యూ కోసం చిత్రాన్ని చూసిన సినీ విశ్లేషకులు ఈ సినిమాకు రేటింగ్‌ ఇవ్వలేమని చేతులెత్తేశారు. తమకా శక్తి లేదని ప్రకటించారు. అయినా బాక్సాఫీస్‌ కలెక్షన్లు బాగానే రాబట్టింది.

 సినిమా నిర్మాణం

సినిమా నిర్మాణం


అందరు గురువులూ తలా ఒక వ్యాపారం లో పడటం తో తానూ ఏలా అయినా కోట్లు సంపాదించాలన్న "మహా సంకల్పం" తో ఈ ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ సినిమా నిర్మాణంలో అడుగుపెట్టారు. ఎంఎస్ జీ పేరుతో ఆయన రెండు సినిమాలు తీసి తానే నటించారు. ఎంఎస్ జీ పార్ట్ 2 సినిమా నెల రోజుల్లో రూ.395 కోట్లు వసూలు చేయడం విశేషం.

 సంస్కృతిని తెలియజేసే పాట :

సంస్కృతిని తెలియజేసే పాట :


సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మనం చెప్పే విషయాన్ని యూత్‌ కరెక్ట్‌గా రిసీవ్‌ చేసుకునే అవకాశం ఉంది. అందుకనే నేను చెప్పాలనుకున్న విషయాలను సినిమాల ద్వారా చెప్పడానికి నిర్ణయం తీసుకున్నాను. అయితే ఈ సినిమాలో నేను గురువులాగా కాకుండా ఒక యోధుడు పాత్రలో కనపడతాను. సినిమాలో మన సంస్కృతిని తెలియజేసే విధంగా ఈసినిమాలో పాట కూడా ఉంది.

 76 కోట్లతో నిర్మించారు:

76 కోట్లతో నిర్మించారు:


ఏ యువకుడైనా తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, రైతులు ఆత్మహత్యలు నివారణ గురించి, మూఢ నమ్మకాల గురించి ఈ సినిమాలో తెలియజేస్తున్నాం. నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం ఈ సినిమాను 76 కోట్లతో నిర్మించారు. నేను చిన్నప్పట్నుంచి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను. 32 ఇంటర్నేషనల్‌ గేమ్స్‌ గురించి తెలుసు. వాటిని ఆడటంలో కూడా నేను నిష్ణాతుడను. ఆటగాళ్లకు శిక్షణ కూడా ఇస్తుంటాను. అని తనగురించి తాను బాగానే చెప్పుకున్నాడు ఈ సినీ బాబా

 హీరో, నిర్మాత, దర్శకత్వం అన్నీ:

హీరో, నిర్మాత, దర్శకత్వం అన్నీ:


‘ఎంఎస్‌జీ, ద వారియర్‌ లయన్‌ హార్ట్‌'. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమాకు ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాడు గురూజీ. దీనిలో భాగంగా తన అభిమానులు, అనుచరులు, శిష్యులతో కలిపి సిర్సా లో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ‘ద వారియర్‌ లయన్‌ హార్ట్‌ ‘ సినిమాలో బహుముఖ ప్రజ్ఞ చూపించబోతున్నాడు గుర్మీత్‌. డూప్‌ లేకుండా స్టంట్స్‌ చేయడం తో పాటు ఈ సినిమాకు హీరో, నిర్మాత, దర్శకత్వం, సంగీతం, ఫైట్లు, ఎడిటింగ్‌, మేకప్‌, కాస్ట్యూమ్స్‌, సినిమాటోగ్రఫీ..ఇలా మొత్తం అన్ని శాఖల బాధ్యతలూ తనే చూసుకున్నాడు...

 సర్జికల్ దాడుల నేపథ్యం:

సర్జికల్ దాడుల నేపథ్యం:


ఇక ఈ ఉత్సాహం లో ఈ మోడరన్ ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో భారత సైన్యం ఇటీవల జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్న వారికి ఈ సినిమా సమాధానంగా నిలుస్తుందన్నారు. ‘ఎం.ఎస్.జి.- ద వారియర్ లయన్ హార్ట్' విజయోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

 సర్జికల్ దాడులకు ఆధారాలు:

సర్జికల్ దాడులకు ఆధారాలు:


‘ఎం.ఎస్.జి.- ద లయన్ హార్ట్- హింద్ కా నాపాక్ కో జవాబ్' పేరుతో సినిమా మొదలు పెట్టబోతున్నాను. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇందులో ప్రధానంగా చూపించబోతున్నాం. సైన్యం జరిపిన సర్జికల్ దాడులకు ఆధారాలు చూపించాలని అడుగుతున్నవారికి ఇందులో సమాధానం దొరుకుతుంది. 25 రోజుల్లోనే ఈ సినిమా పూర్తిచేయాలని భావిస్తున్నామ'ని తెలిపారు.

 తీవ్రవాద స్థావరాలపై

తీవ్రవాద స్థావరాలపై


సెప్టెంబర్ 18న కశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 19 మంది సైనికులు అమరులయ్యారు. దీనికి స్పందనగా భారత ఆర్మీ పీవోకేలోని తీవ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేసింది. 'తరచుగా మనం సైనికులను కోల్పోతున్నాం. ఎంతమంది దీని గురించి మాట్లాడుతున్నారు? హఠాత్తుగా కొంతమంది తెరపైకి వచ్చి సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలని అడుగుతున్నారు. ఇది నన్ను చాలా బాధించింది. ఇలాంటి వారికి నా సినిమా ద్వారా చెప్పాలనుకున్నా'నని గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అన్నారు.

Read more about: baba gurmeet ram rahim
English summary
Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh is set to make a film on surgical strikes that India conducted on terror launch pads across the Line of Control (LoC). It will be titled MSG - The Lionheart - Hind ka NaPak Ko Jawab.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu