రాందేవ్ బాబా కోసం తెగ ట్రై చేస్తున్న రాఖీ
యోగా గురు బాబా రాందేవ్ అంటే నాకు చాలా ఇష్టం, అతను ఒప్పకుంటే పెళ్లి చేసుకుంటా అంటూ మీడియా ప్రకటన చేసి సంచలనం సృష్టించిన బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 'గజబ్ దేశ్ కి అజబ్ కహానియాన్" పేరుతో ఓ టీవీ రియాల్టీ షో నిర్వహిస్తున్న రాఖీ... ఆ షోకు బాబా రాందేవ్ గెస్ట్ ఆహ్వానించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందట.
ఎట్టి పరిస్థితుల్లో బాబా రామ్ దేవ్‌ను ఒప్పిస్తానని, వీలైతే డబ్బుతో...అవసరం అయితే తన సెక్సీతనంతో బాబాను లొంగదీసుకుంటానని, తన షోకు రప్పిస్తానని తన సన్నిహితుల వద్ద ఛాలెంజ్ చేసిందట. అయితే రాఖీ ప్రయత్నాలకు లొంగి బాబా రాందేవ్ ఆమె రియాల్టీ షోలో పాల్గొంటే..... ఇకపై బాబా రాందేవ్ ను యోగా గురు అని కాకుండా, మరోలా పిలిచే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
baba ramdev rakhi sawant ajab desh ki gajab kahani tv reality show బాబా రాందేవ్ రాఖీ సావంత్ అజబ్ దేశ్ కి గజబ్ కహానియా రియాల్టీ షో


Click it and Unblock the Notifications