For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రుద్రమదేవి' 3D తో నటుడుగా మారుతున్న గాయకుడు

    By Srikanya
    |

    హైదరాబాద్: ఉర్రూతలూగించే గీతాల్ని ఆలపించడంలో స్పెషలిస్ట్‌ బాబా సెహగల్‌. టైటిల్‌ సాంగ్స్‌ ఎన్నిటినో పాడి..సినిమాల విజయాల్లో కీలక భూమిక పోషించిన గాయకుడాయన. ఆయన త్వరలో వెండి తెరపై కనిపించి మురిపించనునన్నారు. గుణశేఖర్ తాజా చిత్రం రుద్రమదేవి లో ఆయన కీ రోల్ చేయనున్నారు. ఈ మేరకు కాస్ట్యూమ్ స్క్రీన్ టెస్ట్ జరిగిందని ఆయన ట్వీట్ లో తెలియచేసారు. త్వరోనే ఈ మేరకు షూటింగ్ స్టార్టవుతుందని తెలియచేసారు. ఈ ప్రక్కన అప్ లోడ్ చేసిన ఫోటో...ట్విట్టర్ లో ఆయన పెట్టిందే.

    దర్శకుడు గుణశేఖర్ అనుష్క ప్రధాన పాత్రలో 'రుద్రమదేవి' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా దర్శకుడు ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. సినిమాలో ఎవరు, ఏయే పాత్రలు పోషిస్తున్నారనే వివరాలు పరిశీలిద్దాం.

    అనుష్క : రుద్రమదేవి (టైటిల్ రోల్)
    రాణా : చాళుక్య వీరభద్రుడి పాత్ర
    కృష్ణం రాజు : గణపతి దేవ చక్రవర్తి
    ప్రకాష్ రాజ్ : మహామంత్రి శివ దేవయ్య
    అజయ్ : ప్రసాదాదిత్య
    రవిబాబు : నాగదేవుడు
    నథాలియా కౌర్ : అన్నాంబిక
    హంసానందిని : మదనిక
    ప్రభ : సోమాంబ

    ఇతర ముఖ్య పాత్రల్లో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. ఒక్కడు సినిమా కోసం 'చార్మినార్' సెట్ నిర్మించిన గోపనపల్లి ప్రాంతంలో భారీ సెట్ వేసారు. ఏప్రిల్ 18 నుంచి ఈ సెట్లో ఏకధాటిగా షూటింగ్ జరుపనున్నారు. కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పే 11 భారీ సెట్లను ఈ చిత్రం కోసం నిర్మిస్తున్నారు.

    ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.

    English summary
    Baba Sehgal tweeted...I m honoured to be a part of Mr Gunasekhar's big telugu film Rudhramadevi, shooting starting soon, costume rehearsal. Noted Indian singer Baba Sehgal will be seen in Gunasekhar’s historic film ‘Rudrama Devi 3D’. The singer is trying out some costumes for the film and he has posted a picture of himself on Twitter. Gunasekhar is the director and producer of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X