చిరంజీవి బర్తడే కోసం బాబా సెహగల్ ప్రత్యేకంగా...
బాబా సెహగల్ ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. " చిరంజీవి గారు మీద స్వరపరిచిన పాటను ..ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల చేయబోతున్నారు. పాట పూర్తిగా డాన్స్ తో కంపోజ్ చేసాను. ఆ పాటకు ..చిరు అని నామకరంణ చేసాను ,". అని ఆయన ట్వీట్ చేసారు. ఈ పాటతో ఆయన మెగాభిమానుల అభిమానం మరోసారి పొందబోతున్నారు.
గతంలోనూ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా .. పవ పవ పవన్ కళ్యాణ్ అంటూ ఓ పాటను వదిలారు. అలాగే జల్సా,గబ్బర్ సింగ్ లలో ఆయన పాడిన పాటలు మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. ఇప్పుడు చిరంజీవి మీద రూపొందిస్తున్న పాటు కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం తో ఉన్నారు.
హిందీలో 'మై ఫ్రెండ్ గణేశా', 'మిస్ 420'... లాంటి నాలుగు చిత్రాల్లో నటించిన బాబా సెహగల్, తొలిసారి తెలుగులో నటునిగా మేకప్ వేసుకుంటున్నారు. అది కూడా ఆషామాషీ సినిమా కోసం కాదు. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న 'రుద్రమదేవి' సినిమా కోసం. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సెహగల్‌ని ఎంపిక చేశారు.
ఆయన పాల్గొనగా కాస్ట్యూమ్ రిహార్శల్ కూడా చేశారు. త్వరలో ఈ షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని, గుణశేఖర్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని బాబా సెహగల్ ఆనందం వ్యక్తం చేశారు. రాణి రుద్రమదేవి జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో అనుష్క టైటిల్ రోల్ చేయబోతున్నారు. రానా కీలక పాత్ర పోషించనున్నారు. ఇంకా చాలా మంది ప్రముఖులు ఈ సినిమాలో నటించబోతున్నారు.


Click it and Unblock the Notifications
