పవన్ పుట్టిన రోజున ప్రత్యేకంగా బాబా సెహగల్

By Srikanya

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ కి వీరాభిమానినని చెప్పుకునే సింగర్ బాబా సెహగల్. ఆయన పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఓ గిప్ట్ ఇవ్వనున్నారు. అది మరేదో కాదు. పవన్ పై ఆయన కూర్చి, పాడిన పాట..పవ పవ..పవ..పవ..పవన్ కళ్యాణ్, పవ పవ పవ పవన్ కళ్యాణ్ అంటూ సాగుతుంది. ఈ పాటను సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అన్ని మేజర్ ఛానెల్స్, రేడియో స్టేషన్స్ లో కాలర్ ట్యూన్ గా లభించనుంది. ఈ పాట మంచి హిట్ అవుతుందని బాబా సెహగల్ భావిస్తున్నారు.

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ... నాలాంటి చాలా మంది అభిమానలుకు పవన్ ఓ ప్రేరణ. అందుకే ఆయన పుట్టిన రోజుకి పవర్ స్టార్ కి ఈ పాటను డెడికేట్ చెయ్యబోతున్నాను అన్నారు. ఇలా పవన్ పై పాటను కూర్చటం నాకు చాలా ఇంట్రస్టైన సంగతి అన్నారు. ఇక ఈ పాటను పవన్ పుట్టిన రోజునే ఆవిష్కరిస్తానని చెప్పారు. రీసెంట్ హిట్ గబ్బర్ సింగ్ లోనూ పవన్ కి ఓ పాటను పాడారు బాబా సెహగల్. ఆయన చిరంజీవి రిక్షావాడు చిత్రం లో చిక్ చిక్ చాకెలెట్ పాటతో తెలుగుకి ప్రవేశించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టిన రోజును పురస్కరించుకుని బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పోస్టర్ డిజైన్ చేసారు. ఇప్పటికే ఇవి బయటకు వచ్చినా.... పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా రిలీజ్ చేస్తారు. 3 పాటలు మినహా సినిమా షూటింగ్ ఈ నెలాకరుతో పూర్తవుతుంది. వచ్చే నెలలో మిగిలి ఉన్న మూడు పాటలు చిత్రీకరిస్తూనే... మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. చకచకా పనులు ముగుస్తుండటంతో అనుకున్న సమయం(అక్టోబర్ 18) కంటే వారం ముందుగానే అక్టోబర్ 11న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X