పవన్ కళ్యాణ్ కోసం బాబా పాట
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా పాట పాడటానికి సిద్దం అవుతున్నారు ప్రముఖ సింగర్ బాబా సెహగల్. పవర్ స్టార్ పవనిజంపై ఓ పాట ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం ఖరారైంది. బాబా సెహగల్ పాట త్వరలో ఈ పాట రికార్డ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తనదైన ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఉదారగుణం, స్టైల్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పట్ల...అభిమానులు ఎంతో గర్వంగా ఫీలవుతూ ఉంటారు. అలాంటి స్టార్ కోసం పాడుతున్న పాటను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాబా సెహగల్ తానే స్వయంగా లిరిక్స్ రాసి మరీ దీన్ని కంపోజ్ చేయించనున్నారు.
పవర్ స్టార్ అభిమానులకు కలకాలం గుర్తిండి పోయేలా...మంచి జోష్‌తో కూడి ఈ పాట ట్యూన్స్ ఉండనున్నాయి. ఇందులో ఇప్పటి వరకు పవన్ నటించిన సినిమాల పేర్లతో పాటు, అతని వ్యక్తిత్వం ఎలాంటిది అనే విషయాలను తెలియ పరుచనున్నారు. అదే విధంగా అభిమానులంటే పవన్ ఎంత విలువిస్తారో కూడా ఇందులో పొందు పరుచనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











