పవన్ సినిమాకు సెహగల్ పాట
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న జెల్సా చిత్రంలో బాబా సెహగల్ పాట పాడుతున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన రిక్షవోడు సినిమాలో సెహగల్...రూప్ తేరా మస్తానా...అనే పాటను పాడారు. పాప్ సింగర్ సెహగల్ రిక్షావోడులో పాడడం, ఆ సినిమా హిట్ అవడంతో తన జెల్సా సినిమా కూడా హిట్ అవుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా సెహగల్ మాట్లాడుతూ...రిక్షావోడు సినిమా కోసం పాట పాడడానికి నగరానికి వచ్చినపుడు చిరంజీవి ఎయిర్ పోర్ట్ కు వచ్చి స్వాగతం పలికారు. ఇపుడు ఆయన సోదరుడి సినిమాకోసం పాడుతున్నాను. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందన్నాడు.


Click it and Unblock the Notifications











