twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తండ్రి నిర్మాణంలో తనయుడు 'బబ్లూ'

    By Staff
    |

    Manotej
    మనోతేజ్ అనే యువకుడిని ఒక డైనమిక్ యంగ్ హీరోగా పరిచయం చేస్తూ యస్.పి.జె. క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి గూడురు ఝాన్సిరాణి నిర్మిస్తున్న చిత్రం 'బబ్లూ'. జి.రవిచరణ్ రెడ్డి 'కాళిదాసు' చిత్ర దర్శకుడు. హిమాయత్ సాగర్ చెరువు ఒడ్డున పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. శనివారంనాడు షూటింగ్ జరుగుతున్న ప్లేస్ లోనే చిత్ర విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో కథానాయకుడు మనోతేజ్, కథానాయిక అదితిశర్మ, రవిచరణ్, ముకుల్ దేవ్, కనల్ కణ్ణన్, నటులు శివాజీరాజా, రావు రమేష్, చిత్ర సమర్పకుడు గూడురు శివరామకృష్ణ పాల్గొన్నారు.

    'కాళిదాసు' చిత్రం తర్వాత తాను చేస్తున్న రెండో చిత్రమిదని దర్శకుడు రవిచరణ్ రెడ్డి తెలిపారు. హీరోకు ఇది తొలి సినిమా అయినప్పటికీ, నటనలో ఫైట్స్ లో శిక్షణ తీసుకుని అనుభవమున్న నటుడిలా చేస్తున్నాడనీ, నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా తీస్తున్నారనీ చెప్పారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనన్నారు. శివరామకృష్ణ మాట్లాడుతూ, చక్కటి కథఆంశంతో రూపొందుతున్న ఈసినిమా కథాయాయకుడైన మనోతేజ్ పుట్టినరోజు(19.09.09) కూడా కావడంతో సినిమా మొదలుపెట్టామనీ చెప్పారు. ఈ సందర్బంగా అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు. ఇంతవరకూ 90 శాతం షూటింగ్ పూర్తయిందనీ, ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోందనీ ఒక పాట, ప్యాచ్ వర్క్ తో పూర్తి అవుతుందని తెలిపారు. అక్టోబర్ మొదటివారంలో ఆడియో, చివరి వారంలో సినిమా విడుదలకు సిద్దంచేస్తున్నామని అన్నారు. రావు రమేష్ మాట్లాడుతూ ఇందులో హీరోకి అన్నగా తాను నటిస్తున్నట్టు తెలిపారు. మనోతేజ్ సినిమాను ఎంతో ప్రేమించి పనిచేస్తున్నాడనీ, అతనికి జన్మదిన శుభాకాంక్షలనీ అన్నారు. చక్కటి కథాంశంతో ఎక్కడా ఖర్చుకు రాజీపడకుండా ఈ చిత్రం రూపొందుతోందని, మంచి ప్రతిభ ఉన్న నటుడని శివాజీరాజా పేర్కొన్నారు.

    మనోతేజ్ మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి తనకు సినిమా అంటే చాలా ఇష్టమనీ, తన తండ్రి నిర్మిస్తున్న చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతుండటం సంతోషంగా ఉందనీ అన్నారు. ఈ చిత్రంలో కాలేజీ స్టూడెంట్ పాత్రలో తాను నటిస్తున్నాననీ, కాలేజీ స్టూడెంట్ అంటే పక్కా ఎదవలాగా ఉంటాడు. నిజజీవితంలో కూడా నేను కాలేజీకి వెళ్ళేవాడిని కాదు అన్నారు. ఈ సినిమాలో సీనియర్ నటులంతా ఎంతో సహకరిస్తున్నారనీ చెప్పారు.

    కనల్ కణ్ణన్ మాట్లాడుతూ హీరోను తొలిసారిగా చూసినప్పుడు అతనిలో తెలియని ఆకర్షణ కనిపించింది. అతనికి ఫైట్స్ లో రెండు నెలలు శిక్షణ ఇచ్చాను. అతనితో ఇందులో కొత్త హీరో యిజం తెలియకుండా ఒక వైవిధ్యమైన పైట్ చేయిస్తున్నానన్నారు.

    ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ముకుల్ దేవ్, ఆహుతి ప్రసాద్, వినోద్ కుమార్, రఘుబాబు, కృష్ణ భగవాన్, ఆలీ, వేణుమాధవ్, సురేఖా వాణి, మోనాలిసా, గీతాసింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి చక్రి సంగీతం అందిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X