చిరును పరామర్శించిన బాబు దంపతులు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం చిరంజీవిని కలిశారు. చిరంజీవి నివాసంలో చంద్రబాబు నాయుడు సుమారు రెండు గంటలపాటు గడిపినట్టు సమాచారం. రెండవ కుమార్తె శ్రీజ రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్న తరువాత చిరంజీవి షాక్ గురయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు దంపతులు చిరంజీవిని కలిసి మాట్లాడినట్టు ఎన్టీఆర్ భవన్ వర్గాలు వెల్లడించాయి. చిరంజీవి భార్య సురేఖ, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి మంచి స్నేహితులని అందుకే వెళ్లినట్టు ఆ వర్గాలు తెలిపాయి. చిరంజీవి దంపతులతో మాట్లాడిన చంద్రబాబు దంపతులు తాము ఈ విషయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.


Click it and Unblock the Notifications











