తేజస్వి గెలుస్తుందనుకున్నా, రివర్స్ అయింది అందుకే.. కౌశల్ ఖచ్చితంగా.. బాబు గోగినేని!
Recommended Video

బిగ్ బాస్ హౌస్ లో రెండు నెలలు గడిపిన తరువాత బాబు గోగినేని ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు బాబు ఆడియన్స్ దృష్టిలో ఉన్నారు. ఆయన బాగా ఫోకస్ అవుతూ వచ్చారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక బాబు గోగినేని హౌస్ లో తన అనుభవాలని ఇంటర్వ్యూలలో పంచుకుంటున్నారు. బయట ప్రపంచం గురించి తెలియకుండా హౌస్ లో ఇన్నిరోజుల పాటు కొనసాగానని, ఇది తన జీవితంలో మంచి అనుభవం అని బాబు గోగినేని అన్నారు.

చూడడం మానేశాం
తనకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు కొందరు తాను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మాట్లాడారు. తాను ఎలిమినేట్ అయిన అయిన సందర్భంలో వారంతా బాధపడ్డారని, ఏడ్చారని కూడా బాబు తెలిపారు. అంటే తాను బిగ్ బాస్ ద్వారా ఆడియన్స్ లో చాలా ప్రేమని పొందా. విమర్శించే వాళ్ళు ఎలాగూ విమర్శిస్తూనే ఉంటారు అని బాబు తెలిపారు.

మొదటి ఐదుగురిలో
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సమయంలో తాను మొదటి ఐదుగురిలో ఉండాలని భావించా. కుదిరితే విజేతగా కూడా నిలవాలని అనుకున్నా. కానీ కుదరలేదు. ఇక చాలు అనుకున్న తరువాతే తాను హౌస్ నుంచి బయటకు వచ్చానని బాబు తెలిపారు. ఒకరకంగా వాళ్ళు నన్ను ఎలిమినేట్ చేయడం కాదు.. నేనే ఎగ్జిట్ అయి వచ్చేశా అని బాబు తెలిపారు.

తేజస్వి గెలుస్తుందని
హౌస్ లో కొన్నిరోజులు గడిచాక తేజస్వి గెలుస్తుందని భావించానని బాబు తెలిపారు. కానీ ఆమె చాలా త్వరగా ఎలిమినేట్ అయింది. హౌస్ లోకి వెళ్లే ముందు తాను ఎలా ఉన్నానో అలాగే ఉండమని పంపారు. అది గౌరవంగా భావించా.

ఇలాగే ఏడుస్తుంది
బిగ్ బాస్ హౌస్ లో బయట ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడో వేడినీళ్లు ఇస్తారు. అప్పుడప్పుడు అన్నం పెడుతారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటె నా జడ్జిమెంట్ ఇలాగే ఏడుస్తుంది అని అన్నారు.

కౌశల్ ఖచ్చితంగా
హౌస్ నుంచి బయటకు వచ్చాక పరిస్థితులు గమనిస్తే కౌశల్ తప్పనిసరిగా ఫైనల్ కు చేరుకుంటారని బాబు అంచనా వేశారు. బయట ఆడియన్స్ నుంచి అతడికి సపోర్ట్ లభిస్తోంది. ఓటింగ్ ట్రెండ్స్ కూడా అలాగే ఉన్నాయి.

టార్గెట్ చేయలేదు
తాను బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ గెలుస్తాడని టార్గెట్ చేయలేదు. అతడి ప్రవర్తన పట్ల నిరసన వ్యక్తం చేశానని బాబు తెలిపారు. బిగ్ బాస్ హౌస్ లో బాబు, కౌశల్ మధ్య వార్ జరిగిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











