సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్.. ఏమీ సాధించని అమ్మాయి.. నిహారిక పెళ్లిపై బాబు గోగినేని కామెంట్స్

హేతువాదిగా, నాస్తికుడిగా బాబు గోగినేని చెప్పే ఉపన్యాసాలు, సూక్తుల గురించి అందరకీ తెలిసిందే. అన్నింటిని తర్కబుద్దితో ఆలోచించే బాబు గోగినేని బిగ్ బాస్ షో సెకండ్ సీజన్ కంటెస్టెంట్‌గా పాల్గొని ఉన్న ఇమేజ్‌ను పాడు చేసుకున్నాడు. అప్పటి వరకు బాబు గోగినేని అంటే అందరికీ పాజిటివ్ ఇమేజ్ ఉండేది. కానీ ఆ షో తరువాత ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు బాబు గోగినేని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.

సెకండ్ సీజన్‌లో అలా..

సెకండ్ సీజన్‌లో అలా..

బాబు గోగినేని సెకండ్ సీజన్‌లో పన్నిన పన్నాగాలు, వేసిన ప్లాన్లు అన్నీ ఇన్నీ కాదు. కౌశల్‌కు వ్యతిరేకంగా ఉండటం, బయటకు వెళ్లాక కూడా అతని ఎలా ఎలిమినేట్ చేయాలో దానికోసమే పని చేస్తానని చెప్పడంతో కౌశల్ ఆర్మీ దెబ్బకు ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. గీతా మాధురితోనూ బాబు గోగినేని వాగ్వాదం ఇలా చాలా విషయాల్లో అతనికి నెగెటివ్ ఇమేజ్ వచ్చింది.

కౌశల్‌పై అలా..

కౌశల్‌పై అలా..

సీజన్ అయిపోయాక కూడా బాబు గోగినేని కౌశల్ మధ్య వేడి చల్లార లేదు. కౌశల్ అక్రమంగా గెలిచాడంటూ వాగ్వాదానికి దిగేవాడు. అలా మీడియా ముఖంగానే ఎన్నో సార్లు బాబు గోగినేని కౌశల్ మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. ఆ మధ్య కౌశల్, కౌశల్ ఆర్మీపై వచ్చిన ఆరోపణల సమయంలో బాబు గోగినేని బాగానే హల్చల్ చేశాడు.

తాజాగా మరో సారి..

తాజాగా మరో సారి..

అయితే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న బాబు గోగినేని తాజాగా నిహారిక పెళ్లిపై కామెంట్ చేశాడు. మామూలుగా సెలెబ్రిటీల పెళ్లి అంటే మీడియా ఎలా కవర్ చేస్తుందో అందరికీ తెలిసిందే. నిహారిక పెళ్లి గురించి మీడియాలో వచ్చిన వార్తలపై బీబీసీ తెలుగు ఓ వార్తను రివ్యూగా ప్రచురించింది. ఆ విషయం బాబు గోగినేనికి నచ్చనట్టుంది. వాటిపై తన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించాడు.

అవి కూడా..

అవి కూడా..

దీనికి తోడు BBC వారు పుణ్యం కట్టుకొని తిరుమల, యాదాద్రి లో దేవుళ్ళ నిద్రా శయనాల సమయాలూ, క్యూ టైమింగులు కూడా క్రమం తప్పకుండా చెప్తే మిగతా తెలుగు మాధ్యమాలలా మీరు లేరు ఏమిటీ అన్న బెంగ పోతుంది మాకు అంటూ బాబు గోగినేని సెటైర్ వేశాడు.

Recommended Video

Tollywood Stars At A MB Cinemas | Filmibeat Telugu
సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ కూతురు..

సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ కూతురు..

టీవీ లో కనిపించే ఎకిలి నవ్వుల సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ కూతురు పెళ్లి ఇంకో రాష్త్రం లో జరుగుతుంటే, ఇప్పటివరకూ ఒకరి కూతురిగా కాక ఇంకే విధమైన సొంత అచ్చీవ్ మెంట్ లేని వారి కథనాన్ని ఇంకో పత్రిక ప్రచురిస్తే, ఆ పత్రికలోని వందల కథనాలతో మీరు దీనిని ఎన్నుకుని దాన్ని మీ ప్రెస్ రివ్యూ లో ప్రచురించడం భలే సంబరంగా ఉంది. వెడ్డింగ్ కార్డ్ కూడా చూపిస్తే బాగుండేదంటూ బాబు గోగినేని కౌంటర్ వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X