పవన్‌పై బిగ్ బాస్ కంటెస్టెంట్ దారుణమైన పోస్టు: నాకు వాటి మీదే ఇంట్రెస్ట్ అంటూ నాగబాబు ఘాటుగా!
చాలా కాలం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దీంతో ఆయన అభిమానులు దాదాపు పది రోజుల పాటు పండుగ చేసుకున్నారు. అంతా ఆశించినట్లుగానే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే, వాళ్ల ఆనందాలను ఆవిరి చేసేలా పవన్ కరోనా బారిన పడ్డాడు. ఫలితంగా అభిమానులంతా దుఖంలో మునిగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఫేం, ప్రముఖ సామాజికవేత్త బాబు గోగినేని పవన్‌పై దారుణమైన పోస్ట్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

‘వకీల్ సాబ్’గా రీఎంట్రీ.. బాక్సాఫీస్‌పై దండయాత్ర
సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్‌లు కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు. రిలీజ్ రోజు నుంచే బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తుందీ భారీ చిత్రం.

వాళ్లందరికీ కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌కు పవన్
'వకీల్ సాబ్' సినిమా విడుదలకు ముందే నివేదా థామస్ కరోనా బారిన పడింది. ఆ తర్వాత కూడా యూనిట్‌లోని కొందరితో పాటు పవన్ కల్యాణ్ భద్రతా సిబ్బందిలో పలువురు కోవిడ్ పాజిటివ్‌గా తేలారు. దీంతో ఈ మెగా హీరో హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు, వీడియో కాన్ఫరెన్స్‌లు చేస్తారని కూడా ప్రకటించింది.

పవన్‌కు కూడా కోవిడ్.. ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన
క్వారంటైన్‌లో గడుపుతోన్న సమయంలోనే కొన్ని లక్షణాలు ఉండడంతో పవన్ కల్యాణ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారని తెలుస్తోంది. ఇందులో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేగాయి. ప్రస్తుతం ఆయన తన ఫాంహౌస్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

సినీ ప్రముఖులంతా అలా.. అభిమానులేమో ఇలా
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమ అంతా ఉలిక్కి పడింది. ఈ క్రమంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక, పవర్ స్టార్ అభిమానులైతే దేవాలయాలకు వెళ్లి మరీ ఆయన పేరిట పూజలు జరిపిస్తున్న విషయం తెలిసిందే.

పవన్‌పై బిగ్ బాస్ కంటెస్టెంట్ దారుణమైన పోస్టు
పవన్ కల్యాణ్‌ను పరామర్శించేందుకు స్వామీ వివేకానందతో పాటు చే గువేరా వచ్చినట్లుగా గీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా షేర్ చేశారు బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్, ప్రముఖ సామాజికవేత్త బాబు గోగినేని. అందులో ఆయన వాడిన మాటలు పవన్‌ను కించపరిచేలా ఉన్నాయి. దీంతో ఆయనపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

బాబు గోగినేనిపై ఫ్యాన్స్ ఆగ్రహం... వీడియోలతో
కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాబు గోగినేనిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సమస్యను ఎదుర్కొంటోన్న సమయంలో అండగా నిలవాల్సింది పోయి.. విమర్శలు చేస్తావా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇందులో భాగంగానే సెల్ఫీ వీడియోలతో ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది.

వీధికుక్కతో పోల్చుతూ నాగబాబు స్ట్రాంగ్ రిప్లై
బాబు గోగినేని పెట్టిన పోస్టును ఓ అభిమాని నాగబాబుకు షేర్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను, స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన మెగా బ్రదర్.. 'ఇలాంటివి నాకు పంపకండయ్యా. నేను కేవలం నా పెంపుడు కుక్కల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తాను' అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. తద్వారా బాబును పరోక్షంగా వీధికుక్కతో పోల్చినట్లు ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











