‘‘రాజమౌళి గారు ఏదో ఒకటే ఫాలో అవ్వండి, ఇలాంటి తప్పులు చేయొద్దు’’

By Bojja Kumar

Recommended Video

రాజమౌళి గారు ఏదో ఒకటే ఫాలో అవ్వండి.. తప్పులు చేయొద్దు !

ప్రముఖ తెలుగు దర్శకుడు, 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రతిభాశాలి రాజమౌళి దాదాపు వివాదాలకు దూరంగా ఉంటారు. ఎవరైనా వ్యక్తిని గానీ, ఏదైనా వర్గాన్ని కానీ ఇబ్బంది పెట్టే పనులు అస్సలు చేయరు. అయితే రాజమౌళి తనకు తెలియకుండానే ఒక వర్గం ఆగ్రహానికి గురయ్యాడు.

 నేను నాస్తికుడిని అని చెప్పుకోవడం వల్లే

నేను నాస్తికుడిని అని చెప్పుకోవడం వల్లే

గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ..... తాను నాస్తికుడిని అని చెప్పాడు. అయితే రాజమౌళి ఇలా చెప్పుకోవడాన్ని ప్రముఖ ఇండియన్ హ్యూమనిస్ట్, రేషనలిస్ట్ మరియు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ బాబు గోగినేని తప్పుబట్టారు.

 నాస్తికుడిని అని చెప్పుకుంటూ ఆ పనులేంటి?

నాస్తికుడిని అని చెప్పుకుంటూ ఆ పనులేంటి?

ఇంటర్వ్యూలో తాను నాస్తికుడిని అని చెప్పుకున్న రాజమౌళి ఆ తర్వాత రెండ్రోజులకే చొక్కా విప్పేసి కండువా వేసుకుని ఒక బ్రాహ్మనుడి సంక్షంలో లాంఛనంగా గుడికి వెళ్లారని, రాజమౌళి గుడికి వెళ్లడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అలాంటివి చేస్తూ తాను నాస్తికుడిని అని చెప్పుకోవడం తగదని బాబు గోగినేని అన్నారు.

 రాజమౌళికి దాని అర్థం తెలుసా?

రాజమౌళికి దాని అర్థం తెలుసా?

నాస్తికుడు అంటే దేవుడు లేడు అని నమ్మేవాడు. ఏ డిక్షనరీలో అయినా దీనికి అదే అర్థం. దేవుడు లేడని నమ్ముతూ బ్రతికే మా లాంటి వారం చాలా మంది ఉన్నాం. వందకోట్ల కంటే ఎక్కువ మంది ఈ ప్రపంచంలో మతం లేకుండా, దేవుడిని నమ్మకుండా బ్రతికే వారు ఉన్నారు. రాజమౌళి నాస్తికుడిని అని చెబుతూ గుడికి వెళ్లడం ఏమిటని బాబు గోగినేని ప్రశ్నించారు.

 రాజమౌళి లాంటి వారి వల్ల మేము బదనాం అవుతున్నాం

రాజమౌళి లాంటి వారి వల్ల మేము బదనాం అవుతున్నాం

నాస్తికులమని చెప్పుకుంటూ ఇలాంటి పనులు చేస్తున్న రాజమౌళి లాంటి వ్యక్తుల వల్ల అసలైన నాస్తికులమైన తాము బదనాం అయ్యే పరిస్థితి నెలకొందని, ఇలాంటి వారి వల్ల తమ లాంటి వారిపై ప్రజల్లో నమ్మకం పోతుందని బాబు గోనినేని తెలిపారు. సిపిఐ నారాయణ లాంటి వారు కూడా గతంలో ఇలానే ప్రవర్తించారని అన్నారు.

 రాజమౌళి తప్పు చేశాడు, సమాధానం ఇవ్వలేడు

రాజమౌళి తప్పు చేశాడు, సమాధానం ఇవ్వలేడు

మీ వ్యాఖ్యలపై రాజమౌళి స్పందించారా? అనే ప్రశ్నకు బాబు గోగినేని స్పందిస్తూ..... ‘రాజమౌళి నుండి ఆన్సర్ రాలేదు. వారు పెద్ద వారు. నేను వేసిన ప్రశ్న ఆయన వరకు వెళ్లిందో లేదో తెలియదు. ఒక వేళ వెళితే ఆయనకు సమాధానం చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే అతడు తప్పు చేశాడు' అన్నారు.

 మతానికి వ్యతిరేకం కాదు

మతానికి వ్యతిరేకం కాదు

నేను మతానికి వ్యతిరేకం కాదు. ఎవరి నమ్మకాలు వారివి. కానీ నాస్తికుల మని చెప్పుకుంటూ మతాన్ని నమ్మడం, దేవుడిని పూజించడం సరికాదు. రాజమౌళి లాంటి వారు ఏదో ఒకటే పాలో అయితే బావుంటుంది. ఇలా చెప్పేది ఒకటి... చేసేది మరొకటి అన్నచందంగా ఉండకూడదు అని బాబు గోగినేని అభిప్రాయ పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X