నాని ఆ విషయం మాతో చెప్పాడు.. బిగ్‌బాస్‌పై బాంబు పేల్చిన బాబు గోగినేని!

Recommended Video

Bigg Boss Telugu : Babu Gogineni Talks About Internal Politics Of Show | Filmibeat Telugu

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన ఓ కార్యక్రమంలో బిగ్ బాస్ సెలెబ్రిటీలు కౌశల్, బాబు గోగినేని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాబు గోగినేని మాట్లాడుతూ కౌశల్ నిజాయతీగా బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోలేదని చెప్పే ప్రయత్నం చేశారు. కౌశల్ ఆర్మీ అనేది చీకటి ఒప్పందం అని.. దానిని డబ్బులతో నడిపించి కౌశల్ విజేతగా నిలిచారని బాబు గోగినేని తీవ్రమైన ఆరోపణలు చేసారు. ఈ సందర్భంగా బాబు గోగినేని చేసిన మరో ఆరోపణ బిగ్ బాస్ షోపైనే అనుమానాలు రేకెత్తించే విధంగా ఉంది. బాబు గోగినేని బిగ్ బాస్2 హోస్ట్ నానిని కూడా ఈ వివాదంలోకి లాగాడు.

 ఆధారాలు ఉన్నాయా

ఆధారాలు ఉన్నాయా

కౌశల్ సతీమణి నీలిమ కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. కౌశల్ కుటుంబ సభ్యులు కౌశల్ ఆర్మీని నడిపించారని ఆరోపిస్తున్నారు. మీ వద్ద ఆధారాలు ఉన్నాయా అని నీలిమ బాబు గోగినేనిని ప్రశ్నించారు. కౌశల్ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న తనకు కేరళ వరదల గురించి ఎలా తెలుస్తుంది. నాని చెప్పే వరకు నాకు ఆ విషయం తెలియదు. కేరళ భాదితులకు కౌశల్ ఆర్మీ చేసిన సాయాన్ని కూడా బాబు గోగినేని తప్పుదోవ పట్టిస్తున్నారని కౌశల్ మండిపడ్డాడు.

దొంగ ఓట్లు

దొంగ ఓట్లు

కౌశల్ కు నమోదైన ఓట్లన్నీ దొంగ ఓట్లు అని బాబు గోగినేని ఆరోపించారు. కౌశల్ కు పడ్డ ఓట్లు నకిలీ అకౌంట్స్ నుంచి పడ్డాయని ప్రముఖ మీడియా సంస్థ ఇన్వెస్టిగేషన్ లో తేలిందని బాబు గోగినేని వెల్లడించారు. కౌశల్ కు కనీసం డాక్టరేట్ స్పెల్లింగ్ కూడా తెలియదు. కానీ డాక్టరేట్ వచ్చినట్లు చెప్పుకున్నారు. జాతీయ జెండా లోని అశోక చక్రం గురించి కూడా కౌశల్ కు సరిగా తెలియదు అని బాబు గోగినేని అన్నారు.

నానికి ధైరం లేదు

నానికి ధైరం లేదు

బిగ్ బాస్ లో దొంగ ఓట్లు పడుతున్నట్లు నానికి కూడా తెలుసు. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పే ధైర్యం నానికి లేదు. ఈ విషయాన్ని నేరుగా నానితోనే చెప్పా అని బాబు గోగినేని అన్నారు. బిగ్ బాస్ లో ఇద్దరు ఫైనలిస్ట్ లని దగ్గరుకు పిలిచి చేతులని పట్టుకుని గెలిచిన వారి చేతిని పైకి ఎత్తాలి. బిగ్ బాస్ లో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కానీ బిగ్ బాస్ 2 లో నాని ఆ పని చేయలేదు. ఆ పని తాను చేయలేనని నాని మాతో చెప్పాడు. నాని ఎందుకు అలా చెప్పాడో మీరే అర్థం చేసుకోవాలని బాబు గోగినేని తెలిపారు.

మానవతావాది కాదు

మానవతావాది కాదు

కౌశల్ మాట్లాడుతూ.. బాబు గోగినేనిమానవతావాది అనే ముసుగులో ఉన్నారని తెలిపాడు. బిగ్ బాస్ లో దీప్తి, తనీష్ పెయింటింగ్ టాస్క్ లో ఒకరిని ఒకరు మీదపడి గొడవ పడుతుంటే ఆపకుండా చోద్యం చూశారు. ఆపమని అడిగితే నేనెందుకు ఆపాలి అని అన్నారు. ఇలాంటి వ్యక్తి మానవతావాదా అని కౌశల్ ప్రశ్నించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X