RRR మీద గోగినేని వివాదాస్పద రివ్యూ, జక్కన్న పై సంచలన వ్యాఖ్యలు.. పిల్లలకు చూపించకండి అంటూ
ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు RRR. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రికార్డుల ఊచ కోత కోస్తూ పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తూ ఉండగా కొందరు మాత్రం నెగటివ్ గా స్పందిస్తున్నారు. బాలీవుడ్ మూవీ క్రీటిక్ కేఆర్‌ఖాన్ నెగిటివ్ రివ్యూ ఇవ్వగా ఈ జాబితాలోకి బిగ్‌బాస్ ఫేం బాబు గోగినేని చేరాడు. ఆయన సినిమా మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

మూవీపై ప్రశంసలు
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం RRR. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా అద్భుతమైన స్పందన తెచ్చుకుంటోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ చూసిన ప్రేక్షకులు RRRకు ఫిదా అవుతున్నారు. దీంతో బాలీవుడ్, టాలీవుడ్ సౌత్ ఇండస్ట్రీలకు చెందిన సినీ సెలబ్రెటీల వరసగా ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

చాలా గ్రాండ్‌గా
అయితే తాజాగా ఈ సినిమా మీద బాబు గోగినేని రెచ్చిపోయాడు. ట్విటర్ వేదికగా RRR మూవీపై తన రివ్యూను ఇచ్చాడు. ఈ సందర్భంగా ఈ మూవీపై, జక్కన్న పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాబు గోగినేని. ‘రాజమౌళి గారు RRR మూవీ చాలా గ్రాండ్‌గా తీశారు. ఈ మూవీని ఒక చరిత్రగా నిలపడం కోసం ఆయన చాలా కష్టపడ్డారని అర్థమవుతుంది. అద్భుతమైన నటన.. సూపర్ సినిమాటోగ్రఫి అంటూ ముందు ప్రసంశలు కురిపించారు.

ప్రాధాన్యత ఇవ్వలేదు
ఆ తరువాత కథ మాత్రం బలహీనంగా ఉంది.. హీరోలిద్దరి మధ్య స్నేహం, లాయల్టీ పేలగా ఉంది. సూపర్ మెన్‌ల స్కీన్ షో తప్ప గుర్తుండిపోయే డైలాగ్స్ లేవు.. లోడ్.. ఎయిమ్..షూట్.. అంతే. కథ చాలా నాసిరకంగా ఉందని విమర్శించారు. ఈ సినిమాలో ఉన్న మహిళ పాత్రలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. హాస్యం అసలే లేదు. అంతేకాదు చాలా చోట్ల లాజిక్ మిస్ అయ్యిందని చెప్పుకొచ్చారు.

చిన్న పిల్లలకు చూపించకండి.
అంతేకాదు నాటు నాటు పాట వినోదభరితంగా సాగినప్పటికీ, చివర్లో వచ్చిన టైటిల్ సాంగ్‌ను పూర్తి న్యాయం చేసే విధంగా చూపించలేదని విమర్శించారు. ఈ సినిమాలో స్వాతంత్ర్యం పోరాటంలో ఎదుర్కొన్న సమస్యలను చూపించడంలో విఫలం అయ్యారు. ఈ సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉందని, అంతకుమించిన హింస అని అన్నారు. అందుకే ఈ సినిమా కేవలం పెద్దవాళ్లకు మాత్రమే. చిన్న పిల్లలకు చూపించకండి. ఇక ఈ కథలో తీవ్రత ఉంది కానీ పట్టు లేదని విమర్శించారు.
Recommended Video


మండిపడుతున్నారు.
ఈ సినిమా రెండు భాగాలను ఒకే డైరెక్టర్ చేశాడా? అనే అనుమానం వస్తుంది' అని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేసారు. ఇదిలా ఉంటే అసలు బాబు గోగినేని చేసిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు రకారకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఈ రివ్యూ మొత్తాన్ని ఆయన రాసుకుని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇద్దరు హీరోల అభిమానులు మాత్రం ఆయన మీద మండిపడుతున్నారు. ఒకరేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











