టీడీపి వారే ముంచారు: బాబుమోహన్‌

By Staff

Babu Mohan
తాను నమ్మి కొందరికి అన్ని బాధ్యతలు అప్పగిస్తే వారు తనను నట్టేట ముంచారని, ఈ క్రమంలో ఎవరిని నమ్మాలో తెలియడం లేదని అందోలు తెదేపా అభ్యర్థి పి.బాబుమోహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జోగిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు దేశం పార్టీలోని కొందరు ఇంటి దొంగల మోసంతోనే ఓడిపోయానని మాజీ మంత్రి, అందోలు తెదేపా అభ్యర్థి పి.బాబుమోహన్‌ ఆరోపించారు. ఇటీవలి ఎన్నికల వరకూ తన వెన్నంటే ఉన్న కొందరు తెదేపా నేతలు, రాత్రికి రాత్రి కాంగ్రెస్‌ కు అమ్ముడుపోయి తనకు వెన్నుపోటు పొడిచారని ఆయన విమర్శించారు.

ఎన్నికల్లో చాలా మంది తెదేపా నాయకులు కష్టపడి పనిచేశారని, అయితే కొందరు మాత్రం కాంగ్రెస్‌ కు అమ్ముడు పోగా, ఇంకొందరు ప్రచారం చేయక స్తబ్దంగా ఉండగా, మరికొందరు నిద్రపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ కు ఏఏ విధాలుగా సహాయ సహకారాలందించారో, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు, రశీదులతో సహ తన వద్ద ఉన్నాయన్నారు. అతి త్వరలో వీటిని ప్రజల ఎదుట బహిర్గతం చేస్తానన్నారు.

తాను విపరీతంగా నమ్మిన కొందరు నేతలు తాము ఎన్నికల ప్రచారం చేయకుండానే చేసినట్టు, అంతటా మెజార్టీ తమకే ఉన్నదని తనకు తప్పుడు సంకేతాలిచ్చారన్నారు. గల్లీ స్థాయికి కూడా పనికి రాని కొందరిని తాను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదగనిస్తే, వారేమో ఆ కృతజ్ఞతా భావం లేకుండా తనను మోసం చేశారని ఆరోపించారు. మరో పెద్ద మనిషికి ఆర్థిక బాధ్యతలనప్పగిస్తే తప్పుడు లెక్కలను చూపడమే గాక, కాంగ్రెస్‌ పార్టీకి అన్ని రకాలుగా సహకారమందించారని ఆరోపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X