శోభన్ బాబు పోయేటప్పుడు ఏం

ఇప్పుడు అవినీతితో వేలకోట్ల రూపాయలు కూడబెడుతున్న కాంగ్రెస్ నేతలు ఆయన మరణాన్ని ఉదాహరణగా తీసుకుని డబ్బు సంపాదన మానుకోవాలని ఆయన హితవు పలికారు. గురువారం మెదక్ జిల్లా జోగిపేటలో మహాకూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో భాగంగా బాబు మోహన్ ప్రసంగించారు. సినీ పరిశ్రమలోనే అత్యంత ధనవంతుడుగా పేరొందిన శోభన్ బాబు సినీ రంగంలో సంపాదించిన డబ్బులను ఇతర రంగాల్లో పెట్టుబడులుగా పెట్టి వేలకోట్లు సంపాదించారన్నారు. ఆయన ఆస్తుల విలువ సుమారు రూ. 20 వేల కోట్ల వరకు ఉంటుందని సినీ పరిశ్రమలో చెప్పుకుంటారన్నారు.


Click it and Unblock the Notifications











