బ్రహ్మానందం, కోటాతో బాబూ మోహన్ గొడవ.. కారణం ఏమిటో తెలుసా?
ప్రపంచంలోని ఏ వుడ్‌లోనూ లేనివిధంగా టాలీవుడ్‌లో హాస్య నటులు ఎక్కువ. నాటి కస్తూరి శివరావు దగ్గరి నుంచి నేటి వెన్నెల కిశోర్ వరకు ఎంతోమంది కమెడియన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి, ఒక్కో టైమింగ్.. కానీ ఏమాత్రం వల్గారిటీ లేకుండా ఆరోగ్యకరమైన హాస్యం అందించిన ఘనత తెలుగువారిదే. హాస్యనటుల్లో కొన్ని కాంబినేషన్‌లను ప్రేక్షకులు నేటికీ మరిచిపోలేదు. పాత తరంలో రేలంగి - రమణా రెడ్డి, రేలంగి - గిరిజ, రాజబాబు - రామాప్రభ, అల్లు రామలింగయ్య - రావు గోపాలరావులు జనాన్ని నవ్వించారు.
ఈ తరంలో కోటా శ్రీనివాసరావు - బాబూ మోహన్, కోటా శ్రీనివాసరావు - బ్రహ్మానందంలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. కొన్నేళ్ల పాటు తెరపై వీరు తప్పించి మరో జంటను చూసేందుకు సైతం జనం ఇష్టపడలేదంటే అతిశయోక్తి కాదు. కేవలం వీరి కోసమే దర్శక నిర్మాతలు ప్రత్యేకంగా సీన్లు రాసేవారంటే తెరపై వారు వేసిన ముద్ర అలాంటిది. వీరిలో ఇద్దరుంటేనే తట్టుకోవడం కష్టం.. అలాంటిది ముగ్గురూ ఒక చోట చేరితే పొట్టచెక్కలవ్వాల్సిందే. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టలేదు సరికదా.. సినిమాల్లోనూ ఈ కాంబినేషన్ ఎప్పుడు చూసినా కొత్తగా ఉండేదట.

అయితే స్నేహితులు, కొలిగ్స్ మధ్య గొడవలు చిన్నచిన్న అభిప్రాయ భేదాలు సహజం. అలాగే బాబు మోహన్ - బ్రహ్మానందం- కోటా శ్రీనివాసరావు మధ్య కూడా ఇలాగే గొడవ జరిగిందంటూ చాలాసార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు బాబూ మోహన్. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన కెరీర్ , రాజకీయ జీవితం తదితర ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
ఈ క్రమంలోనే కోటా, బ్రహ్మానందంతో గొడవ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నపై బాబూ మోహన్ స్పందించారు. భార్యాభర్తలు, అన్నాదమ్ములు, తండ్రీకొడుకులకే పడటం లేదు మేమెంత .. సెట్లో యాక్టింగ్ పరంగా మా మధ్య అభిప్రాయ బేదాలు వచ్చేవి. ఆ సమయంలోనే గొడవలు జరిగేవి. ఏం జరిగినా అది తాత్కాలికమేనని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న చిన్నవి ఏమైనా వచ్చినా అప్పటికప్పుడే సరిచేసుకునేవాళ్లమని, ఒకే ప్లేట్‌లో భోజనం చేసేవాళ్లమని బాబూ మోహన్ గుర్తుచేసుకున్నారు. షూటింగ్ సమయంలో హోటల్స్‌లో రెండేసి గదులు బుక్ చేసేవారని, కానీ ఇద్దరం ఒకే గదిలో ఉండేవారమని తెలిపారు.

కోటాతో ఉన్నట్లే బ్రహ్మానందతోనూ సన్నిహితంగా ఉండేవాడినని.. కోటాను అన్నా అంటే, ఆయన నన్ను తమ్ముడూ అనేవారని .. బ్రహ్మానందం నేను బావా బావా అని పిలుచుకునేవాళ్లమని బాబూ మోహన్ చెప్పారు. బయట ఎలా ఉన్నా పని విషయంలో మాత్రం సీరియస్‌గా ఉండేవాళ్లమని.. బ్రహ్మానందం డామినేట్ చేస్తాడనే భయంతో ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండేవాడినని ఆయన గుర్తుచేసుకున్నారు.
నటనకు కోట వంటి కోటా శ్రీనివాసరావు వంటి వ్యక్తుల పక్కన నటిస్తున్నప్పుడు నేను బచ్చాగాడినని కానీ అలర్ట్‌గా ఉండేవాడినని బాబూ మోహన్ చెప్పారు. రోజుకు 5, 6 షూటింగ్‌లు కూడా చేసిన రోజులు ఎన్నో ఉన్నాయన్నారు. నటనపైనే దృష్టి పెట్టాం తప్పించి, కొట్టుకోవాలని, గిల్లుకోవాలని , గిచ్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని బాబూ మోహన్ నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











