సినిమాల్లో కమిడియన్ గా ఓ వెలుగు వెలిగిన బాబు మోహన్..నిజ జీవితంలో ఓ హీరోగా బిహేవ్ చేసి భంగపడ్డారు. టోల్ ఫీజు అడిగిన పాపానికి టోల్ గేటు సిబ్బందిపై దాడికి పాల్పడిన సంఘటనలో మాజీ మంత్రి బాబుమోహన్, మరో నలుగురుపై కేసు నమేదు అయింది. బండ్ల గూడ నివాసి అయిన ఎస్ కె సలీం పటన్ చెర్వు టోల్ గేటు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి పదకొండు గంటల సమయంలో జహీరాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న బాబూమోహన్ ఆరవ నెంబర్ గేటు నుంచి వస్తుండగా సిబ్బంది టోల్ ఫీజు అడిగారు. దీంతో రెచ్చిపోయిన బాబూ మోహన్..వెంటనే రెచ్చిపోయి..మాజీ మంత్రి, టీడీపీ నేత బండినే ఆపుతావా అంటూ దాడికి పాల్పడ్డారు. సలీం చేతిలో ఉన్న టార్చిలైట్ ని లాక్కుని బాబుమోహన్ అతని చేతిపై కొట్టారు. బాధితుడు సలీం పోలిసులకు ఫిర్యాదు చేయగా బాబూమోహన్, మరో నలుగురు అనుచరలు పై కేసు నమోదు చేసారు.