రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్
రాజన్న, విక్రమార్కుడు సినిమాలో నటించిన బేబీ యానీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్నతనంలోనే నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పుడు తన మాటలతో, పంచ్‌లతో ఆశ్చర్యపోయేలా చేస్తోంది. తాజాగా ఆమె సుమ క్యాష్ షోలో గెస్ట్‌గా వచ్చింది. ఆమెతో మరో ముగ్గురు చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా వచ్చారు. అయితే యానీ మాత్రం సుమకు అదిరిపోయే సెటైర్ వేసింది. దెబ్బకు ఒక్కసారిగా షాక్ అయింది.

సుమ షోలో అదే..
మామూలుగా అయితే సుమ హోస్ట్‌గా చేసే ప్రతీ షోలో వయసు గురించి కామెంట్లు వినిపిస్తుంటాయి. అవతల వచ్చిన గెస్ట్‌లు ఎవరైనా సరే సుమను అక్క అని సంబోధిస్తుంటారు. ఇదే విషయమై కొందరు సెలెబ్రిటీలు సుమ మీద కౌంటర్లు వేస్తుంటారు. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా సుమను అక్క అనే పిలుస్తారు.

ఇప్పుడు కూడా..
అయితే ఈచిన్న పిల్లలు కూడా సుమను అక్కా అనే పిలిచారు. గతంలోనూ ఓ సారి క్యాష్ షోలోకి ఈ నలుగురు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నావ్.. ఏం మారలేదంటూ సుమ వయసు మీద పంచ్‌లు వేశారు. అయితే పిల్లలు మాత్రం పెరిగారంటూ సుమ రివర్స్ పంచ్ వేసింది.

అలా మాట్లాడుతూ..
అయితే రాజన్న ఫేమ్ యానీ మాత్రం ఓ కౌంటర్ వేసింది. ఓ ప్రశ్నకు సంబంధించి మాట్లాడుతూ.. రాజీవ్ కనకాల అంకుల్ అనేసింది. అలా రాజీవ్‌ను అంకుల్ అని పిలవడంతో మిగతా వారంతా షాక్ అయ్యారు. సారీ సారీ అన్నా అంటూ మరోసారి కవర్ చేసుకుంది.

అలా ఎలా?
సుమను అక్కా అని పిలిచి.. రాజీవ్ కనకాలను అన్నా అని ఎలా అంటావ్ అని మిగతా వాళ్లు సెటైర్ వేశారు. అంతలోపు సుమ మధ్యలో దూరి.. నన్ను అక్కా అంటే చాలు ఆయన్ను ఎలా పిలిచినా నాకు సంబంధం లేదంటూ కౌంటర్ వేసింది.

రాజీవ్ కనకాల మా నాన్న..
సుమ అలా అనేసరికి యానీ మరో పంచ్ వేసింది. అసలైతే రాజీవ్ కనకాల మా నాన్న అంటూ బాంబ్ పేల్చింది. దీంతో సుమ ఒక్కసారిగా షాక్ అవుతూ.. ఏంటి అని ఆశ్చర్యపోయింది. అవును ఒక సినిమాలో కూతురిగా నటించాను అని కవర్ చేసింది యానీ. దీంతో సుమ కూడా కాస్త ఊపిరి పీల్చుకుని.. అలా అయితే ఓకే అంటూ టాపిక్‌ను ముగించేసింది.


Click it and Unblock the Notifications











