పుత్రోత్సాహం: జెనీలియా తల్లి అయ్యింది
ముంబై: బొమ్మరిల్లు, రెడీ, నా ఇష్టం వంటి చిత్రాల ద్వారా పాపులరైన హీరోయిన్ జెనీలియా. ఆమె ఓ బాబుకి జన్మనిచ్చింది. ముంబయిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మంగళవారం మగబిడ్డని ప్రసవించింది.తల్లీ, బిడ్డా క్షేమం. ఈ విషయాన్ని జెనీలియా భర్త రితేశ్ దేశ్‌ముఖ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రితీష్... 'It's a BBBOOOOYYYYYY!!!!!!!!' అంటూ ట్వీట్ చేసి తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.

'తుజే మేరీ కసమ్'(తెలుగు నువ్వే కావాలి రీమేక్) చిత్రంతో రితేశ్, జెనీలియా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. 2012లో ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు. ఈ యేడాది ఆరంభంలో జెనీలియా గర్భం దాల్చిన విషయాన్ని దంపతులిద్దరూ వెల్లడించారు.
జెనీలియా బిడ్డకు జన్మనిచ్చిందన్న విషయాన్ని తెలుసుకొన్న పలువురు సినీ తారలు జెన్నీ, రితేశ్ దంపతులకు అభినందనలు తెలిపారు. వన్ ఇండియా తెలుగు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











