Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాలు పెద్ద రాడ్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బేబీ డైరెక్టర్
Anil Ravipudi: 'సంక్రాతికి వస్తున్నాం' అనే సినిమాతో డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు క్యూ కడుతున్నారు. తొలి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా తొలి రోజు 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే ఈ సినిమా నాలుగు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 132 కోట్లు వసూలు చేసి.. సంక్రాంతి హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ షాకింగ్ కామెంట్స్ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. ఇంతకీ పోస్ట్ ఎంటో మీరు కూడా ఓ లూక్కేయండి.
డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 'పటాస్' సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా అడుగుపెట్టారు. ఈ సినిమాతో తన కామెడీ టైమింగ్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సుప్రీమ్, రాజా ది గ్రేట్, F1, F2, సరిలేరు నీకెవ్వరు, భగవాన్ కేసరి వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించారు. తన సత్తా ఎంటో చూపించారు. ఈ సినిమాలు హిట్ కావడంతో నిర్మాతలకు కూడా కాసుల వర్షం కురిసింది. ఇక తాజాగా 'సంక్రాంతి వస్తున్నాం' అని సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు అనిల్ రావిపూడి.

'సంక్రాంతి వస్తున్నాం' సినిమా కు ఎవరు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తుంది. వెంకటేష్ యాక్టింగ్ కు, అనిల్ టేకింగ్ కు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా నాలుగు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 132 కోట్లు వసూలు చేసి, సంక్రాంతి హిట్ గా నిలిచింది. అదే తరుణంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ వహించిన ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంతు కేసరి లు వరుసగా యుఎస్ లో మిలియన్ డాలర్లతోపాటు 100 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు నిలిచిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో తాజాగా సంక్రాంతికి వస్తున్నాం కూడా చేరిపోయింది . ఇలాంటి అర్ధమైన రికార్డు క్రియేట్ చేసిన అనిల్ రావిపూడి పై ప్రశంసల వర్షం కురుస్తుంది.
అయితే కొంతమంది యూట్యూబ్ రివ్యూస్.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా క్రింజ్ వీడియోలు, ట్రోలింగ్స్, నెగిటివిటీ క్రియేట్ అయ్యేలా మీన్స్ క్రియేట్ చేస్తున్నారు. అనిల్ రాయిపూడి సినిమాలను జబర్దస్త్ కామెడీ అని, అందులో కథ ఏమీ ఉండదని, ఏదో అలా నెట్టుకవస్తున్నారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ ను డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు. తాను అలాంటి విషయాలను పట్టించుకోననీ, అలాంటి వాళ్ల కోసం తాను సినిమా తీయడం లేదని, తనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని, అందుకే ఈసారి కూడా సంక్రాంతికి వస్తున్నాం అనే వెల్లడించారు. ఎవరు ఊహించని విధంగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్ తనదైన స్టైల్ లో ఓ పోస్ట్ పెట్టారు.

అనిల్ రావిపూడి పై నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తూ ట్రోల్స్ చేస్తే వారినిటార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ అనిల్ రావిపూడిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే వారికి కౌంటర్ ఇచ్చారు. సాయి రాజేష్ తన పోస్ట్ లో ' కొంతమంది అనిల్ కంటెంట్ ని రాడ్ పూడి అంటారు. కొందరూ క్రిటిక్స్ క్రింజ్ అంటారు. మరికొందరూ యూట్యూబర్స్ లో ట్రోల్ చేస్తూ వీడియోలు చేస్తారు. కానీ, అనిల్ తన మార్గాన్ని మార్చుకోలేదు. అతని సినిమాల టికెట్స్ కొని నిర్మాతలకు ప్రాఫిట్స్ ఇచ్చే ఆడియన్స్ ని ఆయన గౌరవిస్తాడు. ఫేక్ యూట్యూబర్స్ ట్రాప్ లో పడరు. ఇవాళ అనిల్ రావిపూడి 8 వరుస హిట్స్ తో సక్సెస్ ఫుల్ గా నిలిచాడు. అలాగే.. 356 కి 356 షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. వందల మంది కుటుంబాలు టికెట్స్ కొనుక్కొన్నారు. వారు తమ సమస్యలను మర్చిపోయి రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకున్నారు. మీ హార్ట్ ఏం చెప్తే అదే వినండి. ఎవరూ చెప్పేది వినకండి. మనసా వాచా కర్మణా మీ పని చేయండి. అదే సక్సెస్ అవుతోంది. అనిల్ రావిపూడి కంగ్రాట్స్. ప్రతి దర్శకుడు నీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు' అంటూ ఓ స్పెషల్ పోస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











