Baby Director SaiRajesh: 'బ్రో'ను నెట్టేసిన 'బేబీ'.. ఇగ నేను నోరు మూసుకుంటానంటూ డైరెక్టర్ ట్వీట్

బేబీ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు డైరెక్టర్ సాయి రాజేశ్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ పై ఫైర్ అవుతున్నారు. ఇక ఈ క్రమంలో బేబీ డైరెక్టర్ ఓ ట్వీట్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే...

ఈ మధ్య కాలంలో కంటెంట్ ఉంటే.. అది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని ప్రేక్షకులు చూడరు. స్టార్ హీరో, హీరోయిన్స్ లేకపోయినా.. స్టార్ డైరెక్టర్ కాకపోయినా.. కంటెంట్ బాగుంటే.. ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతారు. అలా ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా రిలీజ్ అయి బేబీ మూవీ సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఇక ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రలుగా ఈ మూవీ తెరకెక్కింది.

Baby Director sai rajesh

ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎస్కేఎస్ కేవలం నాలుగున్నర కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత పవన్ బ్రో సినిమా రిలీజ్ అయింది. దీనికి మిక్స్ డ్ టాక్ రావడంతో... సోషలో మీడియాలో బ్రో సినిమా కంటే బేబీ వసూళ్లు ఎక్కువగా వస్తున్నాయని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇదే విషయం మీద ట్విట్టర్లో త్రివిక్రమ్ డైలాగ్స్ పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి.. ఓ ట్వీట్ చేశారు. అందులో బ్రో కంటే బేబీ సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుందని ఫ్రూవ్ చేయడానికి కొంతమంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో డబ్బులు కడుతున్నారు.. వాళ్ల ప్రమోషనల్ స్ట్రాటజీ చూస్తే.. బ్రో టీజర్ సూపర్ గా ఉందంటారు.. టీ షర్ట్స్ వేసుకుంటారు.. ఆ తర్వాత బేబీ ట్రైలర్ అనౌన్స్ చేస్తారు.

Baby Director sai rajesh

ఇక ఆరెంజ్ మూవీ స్పెషల్ షో వేసి వచ్చిన కలెక్షన్ల చెక్ ఇచ్చి అప్డేట్ రిలీజ్ చేస్తారు. ఒక రకంగా పవన్ కల్యాణ్ అభిమానులను తమ సినిమాల కోసం వాడుకుంటున్నారు. వాళ్ల ప్రమోషన్స్ పాటర్న్ చూడండి అంటూ మరో ట్వీట్ చేశారు. ఇక అందులో సాయి రాజేశ్ పెట్టిన రెండు ట్వీట్ ల స్క్రీన్ షాట్లు షేర్ చేశారు. అయితే వాళ్లు సాయి రాజేశ్ ను ఉద్దేశించి పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

జూన్ 29 మధ్యాహ్నం రెండు గంటల 55 నిమిషాలకు బ్రో టీజర్ బాగుందని పోస్ట్ పెట్టి... ఆ తరువాత బేబీ ట్రైలర్ డేట్ అనౌన్స్ చేశారని త్రివిక్రమ్ ట్విట్టర్ హ్యాండిల్ తెలిపారు. తరువాతి రోజు బేబీ పోస్ట్ ప్రొడక్షన్ , ప్రమోషన్స్ పక్కన పెట్టి మరీ తొలిప్రేమ కి వెళ్దాం అని కటింగ్ ఇచ్చారు. ఇలా మోసం చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేయడంతో ఈ విషయం మీద సాయి రాజేష్ స్పందించారు. ఇక వారి ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ... నేను ఇక నోరు మూసుకుంటాను అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X