ఐశ్వర్యకు సౌందర్యరాశి ఐశ్వర్యే పుడుతుందట..ప్రముఖ జ్యోతిష్యుడు

By Sindhu

2007 ఏప్రిల్‌ 20 న మ్యారేజ్‌ చేసుకున్న ఐష్, అభీ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. గతంలో అనేకసార్లు ఐశ్వర్యా ప్రెగ్నెన్సీపై ఊహాగానాలు చెలరేగాయి. మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం అమితాబచ్చనే స్వయంగా తన కోడలు గర్భవతి అని, తాను తాతయ్యను కాబోతున్నానని ట్విట్టర్‌ లో తెలపడంతో ఐశ్వర్య ప్రెగ్నెన్సీ విషయం వెలుగులోకొచ్చింది. అప్పుడెప్పుడో ప్రపంచ సుందరి కిరీటాన్ని పొందిన ఐశ్వర్యా రాయ్ లో ఇప్పటికీ ఆ ఛాయలు తగ్గలేదు.

ప్రపంచసుందరి ఐశ్వర్యా రాయ్ త్వరలో తల్లి కాబోతోందన్న వార్తను అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలియజెప్పగానే, ఇప్పుడంతా ఆమెకు అబ్బాయి పుడతాడా? అమ్మాయి పుడుతుందా? అంటూ చర్చించుకుంటున్నారు. అయితే, ఆమెకు గ్యారంటీగా అమ్మాయే పుడుతుందని ముంబై కి చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు భావిక్ సంఘ్వి నొక్కి చెబుతున్నాడు.

'కచ్చితంగా ఆడపిల్లే పుడుతుంది. గ్రహాలన్నీ ఆ మాటే చెబుతున్నాయి' అంటున్నాడీ జ్యోతిష్యుడు. పుట్టబోయే ఆడపిల్ల అచ్చం తల్లిలా సౌందర్యరాశి అవుతుందనీ, అయితే ఎత్తులో తండ్రి పోలిక వస్తుందనీ కూడా చెబుతున్నాడు. చివర్లో మరో విషయం కూడా చెప్పాడీయన. అదేమిటంటే... ఐష్ కు కవలపిల్లలు పుట్టే అవకాశం కూడా వుందంటున్నాడు. 2011 లో ఐశ్వర్య తప్పకుండా తల్లి అవుతుందని గత నవంబర్లోనే ఈ జ్యోతిష్యుడు చెప్పిన సంగతిని అంతా గుర్తుచేసుకుంటూ... ఆడపిల్లకే ఫిక్స్ అయిపోతున్నారంతా!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X