షారుక్ ఫ్యామిలీలో ఓ బిడ్డ పుట్టిందోచ్!
అసలు వివరాల్లోకి వెళితే, గౌరీఖాన్ మరదలు నమితా చిబ్బెర్ ఇటీవల ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో మగ పిల్లాడికి జన్మనిచ్చింది. అయితే ఆ బేబీ ఏడు నెలల వయసులోనే జన్మించడంతో ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో ఉంచారు. ఇటీవల తరచూ గౌరీ ఖాన్ ఆ ఆసుపత్రికి రావడం ప్రారంభించారు. షారుక్ కూడా అప్పుడప్పుడూ కనిపించేవారు.
అయితే షారుక్ వచ్చేది మాత్రం తన భుజం ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో డాక్టర్ ఫాలోఅప్ కోసమేనట. అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే షారుక్-గౌరీలపై సర్రోగేట్ బేబీ రూమర్ వచ్చినట్లు స్పష్టం అవుతోంది. తమకు సంబంధం లేకుండా ఇలాంటి పుకారు ప్రచారం కావడంతో ఇద్దరూ విస్తుపోయారు.
సర్రోగేట్ పద్దతి కాబట్టి...షారుక్-గౌరీ మూడో బిడ్డ విషయంలో సెక్స్ డిటర్మినేషన్(లింగ నిర్ధారణ) జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయమై విచారణ జరుపాలని, వారు ఈ పద్దతిలో బిడ్డను కనడానికి ఎలా అర్హులో కనుగొనాలని 'ఇండియన్ రేడియోజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్(IRIA) కూడా డిమాండ్ చేయడంతో ఇదో పెద్ద ఇష్యూగా మారింది. అసలు సంగతి ఇదన్నమాట.


Click it and Unblock the Notifications












