Baby డైరెక్టర్‌కు నిర్మాత బెంజ్ కారు గిఫ్టు... ఇంతకీ దాని విలువ ఎంతంటే?
ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం బేబీ. ఆనంద్ దేవరకొండ, విరాజ్, వైష్ణవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం దాదాపు 100కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేష్ కు నిర్మాత ఎస్కేఎన్ కారు గిఫ్టుగా ఇచ్చారు. అసలు దాని విలువ ఎంతో తెలుసుకుందాం.
చిన్న సినిమాగా రిలీజ్ అయి సంచలనం సృష్టించిన చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వం వహించాడు.ఇక జులై 14న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

బేబీ సినిమా ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ తక్కువ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ చి్త్రం రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి మంచి టాక్ వచ్చింది. దీంతో బేబీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాపై సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అర్జున్ వంటి స్టార్స్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు.
బేబీ చిత్రం చిన్న సినిమాగా థియేటర్ల వద్దకు వచ్చింది. భారీ తారాగణం కూడా లేదు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో ట్రై యాంగిల్ లవ్ ఎంటర్ టైనర్ గా వచ్చి యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక అక్కడ కూడా ఈ సినిమా సంచలన వ్యూస్ రాబడుతోంది. చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు రాబట్టడం విశేషమే అని చెప్పవచ్చు.
అయితే హృదయ కాలయం, కొబ్బరి మట్ట వంటి స్ఫూఫ్ సినిమాలు తీసిన దర్శకుడు సాయి రాజేశ్... బేబీ సినిమా దగ్గరకు వచ్చేసరికి అద్భతంగా తెరకెక్కించారు. ఒక అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమించి... మరో అబ్బాయితో స్నేహం పేరుతో తన లిమిట్స్ క్రాస్ చేసి... చివరకు ఇద్దరి అబ్బాయిల జీవితాలు ఎలా మలుపు తిరిగాయనే కథాశంతో అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు.
ఈ నేపథ్యంలోనే నిర్మాత ఎస్కేఎన్ దర్శకుడు సాయి రాజేశ్ కు బెంజ్ కారును బహుమతిగా అందించారు. షో రూమ్ లో కారు కీని దర్శకుడికి ఇచ్చారు. ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ బెంజ్ కారు విలువ ఎంత అంటూ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఆ బేంజ్ కారు విలువ సుమారు రూ.45 లక్షల నుంచి రూ. 50లక్షలు ఉండనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











