బేబి టీమ్ బౌన్సర్ల అత్యుత్సాహం.. ఆస్పత్రిలో జర్నలిస్టులు.. వీడియో వైరల్
సినీ పరిశ్రమలో ఒక్కోసారి ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. పలు వివాదాలతో సినిమాలు సతమతవం అవుతుంటే కొన్నిసార్లు తెలియక చేసిన పొరపాట్లు ఊహించని పరిణామాలను సృష్టిస్తుంటాయి. అలాగే ఒక సినిమా హిట్ అయిందంటే చాలు అందులో నటించినవాళ్లను చూసేందుకు ప్రజలు గుమిగూడతారు. ఇలాంటి సమయాల్లో ఫ్రస్టేషన్, అత్యుత్సాహం వల్ల అనుకోని సంఘనటలు జరుగుతుంటాయి. అలా తాజాగా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న బేబి సినిమా (Baby Movie) టీమ్ కు ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నిర్మాతలు: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం బేబి (Baby). ఈ సినిమాను హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాల దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు. దీనికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా.. డైరెక్టర్ మారుతీ, ఎస్‍కేఎన్ (శ్రీనివాస కుమార్) సంయుక్తంగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు.

వాటితో పోలుస్తూ: ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఎమోషనల్ కాన్సెప్టుతో వచ్చిన బేబి సినిమాను అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 చిత్రాలతో పోలుస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆ సినిమాల్లో మరిపిస్తున్నాయంటూ పొగిడేస్తున్నారు. ఇక బేబి సినిమా సక్సెస్ మీట్స్ కూడా భారీగానే జరిగాయి. ఈ ఈవెంట్లలో మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ టీమ్ పై ప్రశంసలు కురిపించారు.

సక్సెస్ టూర్స్: జూలై 28న విడుదలైన బేబి సినిమా కలెక్షన్ల పరంగా కూడా సత్తా చాటుతూ దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో తాజాగా బేబి సినిమా వివాదంలో ఇరుక్కుంది. బేబి సినిమా టీమ్ ప్రస్తుతం పలు నగరాల్లో సక్సెస్ టూర్స్ కండక్ట్ చేస్తోంది. ఇందులో భాగంగానే భీమవరంలో బేబి సినిమా టీమ్ సందడి చేసింది. కానీ అంతలోనే ఓ థియేటర్ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది.

ఆందోళనకు దిగి: భీమవరంలో బేబి సినిమా టీమ్ రావడంతో ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులు గుంపుగా వచ్చారు. అయితే గుంపుగా వస్తోంది మీడియా ప్రతినిధులు అని తెలియక బేబి టీమ్ బౌన్సర్స్ వారిని తోసేశారు. అలాగే కాస్తా దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో పలువురు జర్నలిస్టులు కిందపడిపోయారు. దీంతో వారికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటనతో బేబీ టీమ్ పై రిపోర్టర్లు ఆందోళనకు దిగారు.

క్షమాపణలు: బేబి సినిమా నిర్మాత ఎస్‌కేఎన్ (Producer SKN) కారును జర్నలిస్టులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లలేకపోయిన ఎస్‌కేఎన్ బయటకు వచ్చి రిపోర్టలతో వాదించారు. కొద్దిసేపు ఘర్షణ వాతారవరణం చోటుచేసుకుంది. తర్వాత అసలు విషయం తెలుసుకున్న బేబి టీమ్ జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ వివాదం సద్దుమణిగిపోయింది.
జన సైనికులు:అయితే బేబీ టీమ్ తో రిపోర్టలు ఆందోళనకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అలాగే గాయాలపైలైన జర్నలిస్టులను ఆస్పత్రిలో చేర్పించారు. అందుకు సంబంధించిన విజువల్స్ సైతం నెట్టింట్లో దర్శనం ఇచ్చాయి. అయితే ఈ వివాదంపై బయట ప్రచారం వేరేలా కూడా జరిగింది. జనసేన సైనికులతో నిర్మాత ఎస్‌కేఎన్ గొడవపడినట్లుగా ట్వీట్లు చేశారు. కానీ, తర్వాత వాళ్లు రిపోర్టర్స్ అని అసలు మ్యాటర్ తెలిసింది.


Click it and Unblock the Notifications











