Baby producer SKN: జర్నలిస్ట్ అయితే అలా వస్తారు.. భీమవరం గొడవపై బేబి నిర్మాత క్లారిటీ

చిన్న సినిమాగా విడుదలై మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్న చిత్రం బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రులుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ క్రమంలో బేబీ ప్రమోషన్స్ మరింత పెంచేందుకు చిత్రబృందం పర్యటనలు ప్రారంభించగా.. ఈరోజు భీమవరంలో పర్యటించారు. అక్కడ బేబీ బౌన్సర్స్ కొందరు వ్యక్తులపై దాడి చేసినట్లు వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే...

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం బేబి. ఇక ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించాడు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట వంటి స్పూఫ్ సినిమాలు తీసిన సాయి రాజేశ్.. ఈసారి ఓ అద్భతమైన లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా.. పాటలు ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ మారుతీ, ఎస్‍కేఎన్ (శ్రీనివాస కుమార్) సంయుక్తంగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు.

Baby producer SKN

ఇక ఈ సినిమా రిలీజ్ అయి 20 రోజులు దాటినా... కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. నాలుగు కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక త్వరలో ఈ సినిమా వందకోట్ల మార్కును అందుకోతున్నట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో చిత్రబృందం బేబి సినిమా టీమ్ ప్రస్తుతం పలు నగరాల్లో సక్సెస్ టూర్స్ కండక్ట్ చేస్తోంది. ఇందులో భాగంగానే భీమవరంలో బేబి సినిమా టీమ్ సందడి చేసింది. కానీ అంతలోనే ఓ థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.


భీమవరంలో బేబి సినిమా టీమ్ రావడంతో ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులు గుంపుగా రావడంతో.. బేబీ మూవీ బౌన్సర్స్ వారిని నెట్టేశారు. దీనితో పలువురు జర్నలిస్టులు కిందపడిపోయారు. దీంతో వారికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటనతో బేబీ టీమ్ పై రిపోర్టర్లు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాత ఎస్కెఎన్ ఈ ఘటనపై క్లారిటీనిచ్చారు. అసలు జరిగిన విషయం ఏమిటో చెప్పుకొచ్చారు.

బేబీ నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ... ఈరోజు భీమవరంలో ఒక థియేటర్ను మేం సందర్శించాము. జనం విపరీతంగా వచ్చి మీద పడిపోతున్నారు. అలాంటి సమయంలో బౌన్సర్లు ముందుగా మా టీము వాళ్లని సేవ్ చెయ్యడానికి చూస్తారు. ఎందుకంటే అంత క్రౌడ్ ఒక్కసారిగా మీద పడితే మామూలుగా ఉండదు. అందుకని బౌన్సర్లు అలా వచ్చిన క్రౌడ్ ని కొంచెం నెట్టారు, అంతే.. అంటూ చెప్పుకొచ్చాడు.

Baby producer SKN

అయితే అందులోనే ఒక లోకల్ మీడియా పర్సన్ కూడా ఉండటంతో అతన్ని బౌన్సరు చూసుకోలేదు. అతను మొబైల్ తో వీడియో తీసుకుంటూ ఉంటే మామూలు పర్సన్ అనుకున్నాడు బౌన్సర్. ఎందుకంటే లోకల్ మీడియా పర్సన్ అయితే కెమెరా పట్టుకొని వస్తారు అన్న భావంతో, అందుకని క్రౌడ్ తో పాటు అతన్ని కూడా నెట్టేశాడు.. అని క్లారిటీ ఇచ్చాడు చిత్ర నిర్మాత ఎస్కేఎన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X