బేబీ షామిలి మళ్లీ హల్‌చల్.. నాగశౌర్యతో కలిసి జోష్‌గా..

By Rajababu

Recommended Video

Ammammagarillu First Look Is Impressive

చలో సినిమా సక్సెస్ జోష్‌తో హీరో నాగశౌర్య దూసుకెళ్తున్నాడు. ఒకప్పుడు బాలతారగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకొన్న బేబి షామిలితో తాజాగా అమ్మమ్మగారిల్లు సినిమా కోసం జతకట్టాడు. శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్‌లో కె.ఆర్ మ‌రియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం అమ్మమ్మగారిల్లు. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. కాగా ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

 పండగ వాతావరణం

పండగ వాతావరణం

హీరో నాగ‌శౌర్య మాట్లాడుతూ తొలిసారి చ‌క్క‌ని కుటుంబ క‌థా చిత్రంలో న‌టిస్తున్నారు. షూటింగ్ సమయంలో సెట్‌లో పండ‌గ వాతావార‌ణం నెలకొన్నది. కుటుంబంలో అనుబంధాలు, ఆప్యాయ‌త‌లు, అనురాగాలు ఈ చిత్రంలో చూడవచ్చు. కుటుంబంలో ఉండే మ‌నస్ప‌ర్ధ‌లు, ఆవేద‌న తదితర అంశాలను ద‌ర్శకుడు చ‌క్క‌గా తెర‌కెక్కించాడు అని అన్నాడు.

కథను నమ్మి చేశాం

కథను నమ్మి చేశాం

అమ్మమ్మగారిల్లు చిత్రానికి కథే బలం. క‌థ‌ను న‌మ్మి సినిమా చేశాం. నిర్మాణ విలువ‌లు ఎక్క‌డా త‌గ్గ‌కుండా ఉంటాయి. క్వాలిటీగా సినిమా చేసిన నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి ఈ సినిమాతో నేను మ‌రింత ద‌గ్గ‌ర‌వుతాను అని నాగశౌర్య తెలిపాడు.

 కథ నచ్చకనే చేయలేదు

కథ నచ్చకనే చేయలేదు

హీరోయిన్ షామిలి మాట్లాడుతూ, ఓయ్ సినిమా త‌ర్వాత స‌రైన క‌థ కుద‌ర‌క‌పోవ‌డంతోనే మ‌రో సినిమా చేయ‌లేదు. చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ అమ్మమ్మ‌గారిల్లు క‌థ న‌చ్చ‌డంతో సినిమాకు వెంట‌నే ఒప్పుకున్నాను. నా క్యారెక్ట‌రైజేష‌న్ చాలా కొత్త‌గా ఉంటుంది. నాగ‌శౌర్యతో సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది. అలాగే ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు.

కాన్సెప్ట్‌ను ఆధారంగా

కాన్సెప్ట్‌ను ఆధారంగా

ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సూర్య మాట్లాడుతూ.. రిలేష‌న్ నెవెర్ ఎండ్ అనే కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకుని రాసిన క‌థ ఇది. ద‌ర్శ‌కుడిగా నాకిది తొలి సినిమా. తెర‌పై సినిమా చూస్తున్నంత సేపు ఆడియ‌న్స్ కు థియేట‌ర్ లో ఉన్నామ‌న్నా ఫీలింగ్ కాకుండా పండ‌గ వాతావ‌ర‌ణంలో త‌మ కుటుంబంతో గ‌డుపుతున్న అనుభూతి క‌లుగుతుంది అని చెప్పారు.

నాగ‌శౌర్య అద్భుతంగా

నాగ‌శౌర్య అద్భుతంగా

నాగ‌శౌర్య అద్భుతంగా న‌టించాడు. ఎమోష‌న్ స‌న్నివేశాల్లో ఒదిగిపోయాడు. మిగ‌తా న‌టీన‌టులంతా కూడా త‌మ పాత్ర‌ల ఫ‌రిది మేర అద్భుతంగా న‌టించారు. ఇంత‌ మంచి సినిమా చేసే అవ‌కాశం ఇచ్చి నిర్మాతలు రాజేష్, ఆర్కె గారికి కృత‌జ్ఞ‌త‌లు అని ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సూర్య అన్నారు.

 హృదయానికి హత్తుకునేలా

హృదయానికి హత్తుకునేలా

చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ.. సినిమా బాగా వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు ప్ర‌తీ స‌న్నివేశాన్ని హృద‌యానికి హ‌త్తుకునేలా తెర‌కెక్కించారు. అలాగే నాగ‌శౌర్య న‌ట‌న సినిమాకు హైలైట్ గా ఉంటుంది. న‌ట‌న‌పై ఆయ‌న క‌మిట్ మెంట్..డెడికేష‌న్ చాలా బాగున్నాయి. భ‌విష్య‌త్ లో పెద్ద స్టార్ అవుతాడు. మేము సినిమా నిర్మించి ఎంత అనుభూతి పొందామో....సినిమా చూసిన త‌ర్వాత అంతే అనుభూతి ప్రేక్ష‌కులు పొందుతారు అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X