రివాల్వర్ తల క్రింద ఉండాల్సిందే!!

By Staff

Amitabh Bachchan
అవును..రివాల్వర్ తల క్రింద ఉండాల్సిందే..ప్రస్తుత నా పరిస్దితి అదే అంటున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.సినిమాల్లో ఎన్నో మార్లు తన చేతిలోకి చట్టాన్ని తీసుకుని ప్రత్యర్దులను ఒణికించిన ఆయన తొలిసారి అలాంటి పరిస్ధితి ఉత్పన్నమయిందని ఆవేదన చెందుతున్నారు. తన బ్లాగులో ముంబయి ప్రేలుళ్ళ ఎఫెక్టు గురించి రాస్తూ.

క్రిందటి రాత్రి ముంబయి బాంబు ప్రేలుళ్ళతో ఒణికిపోతున్న వేళ మొదటసారిగా నాకు ఏం జరుగుతుందో అర్ధంకాని స్ధితి ఏర్పడింది. నిద్ర పట్టలేదు. వెంటనే లైసన్స్ ఉన్న నా .32 రివాల్వర్ ని తీసి లోడ్ చేసి పిల్లో క్రింద పెట్టుకున్నాను.ఇలాంటి పరిస్ధితుల్లో నా లాంటి అవకాశం లేని సామాన్యుడు ఎలా రియాక్ట్ అవ్వాల్లో నాకు అర్ధం కావటం లేదు. ఎంతోమంది బ్రిలియంట్ ఆఫీసర్స్,పోలీస్ పర్శనల్స్ ఈ మారణ హోమంలో బుగ్గయ్యారు.

నేను చేయగలిగిందల్లా వారి సిన్సియార్టీకి మనస్పూర్తిగా సెల్యూట్ చేయటమే. ఈ పరిస్ధితిల్లోనూ ముంబయి వాసులు తమ స్పిరిట్ కోల్పోకుండా ఉండాలని కోరుకుంటున్నా.ఇలా తన ఆక్రోశాన్ని అమితాబ్ తన బ్లాగ్ లో వెళ్ళబుచ్చారు. అయితే ఎలక్ట్రానిక్ ఛానెల్ వాళ్ళు మీ సంతాపం తెలియ చెయ్యండని మైకులు పట్టుకెళ్ళితే దయచేసి నన్ను విచిత్రమైన స్టేట్ మెంట్స్ ఇవ్వమని అడక్కండి. ఈ స్ధితిలో నేను వ్యూయర్స్ అటెంక్షన్ కోరుకోవటం లేదు అంటూ సున్నితంగా తిరస్కరించారు. దటీజ్ అమితాబ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X