ఫన్ లవ్ స్టోరి ( 'బ్యాక్‌బెంచ్ స్టూడెంట్' ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్ : 'స్నేహగీతం', 'ఇట్స్ మై లవ్‌స్టోరీ' దర్శకుడు తాజా చిత్రం 'బ్యాక్‌బెంచ్ స్టూడెంట్' ఈ రోజు విడుదలవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 180 పైగా థియేటర్లు, యు.ఎస్.లో 25 థియేటర్లలో ఈ సినిమా రిలీజవుతోంది. ప్రేమ,కెరీర్ చుట్టూ తిరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కిచామని, 'బ్యాక్‌బెంచ్ స్టూడెంట్'కు నైజాంలో ఏకంగా 90 థియేటర్లు దొరకడం సంతోషంగా ఉంది.ఇది ఆడకపోతే బాధ్యత పూర్తిగా నాదే అని దర్శకుడు అన్నారు.

కార్తీక్‌ (మహత్‌ రాఘవేంద్ర) ఇంజనీరింగ్‌ విద్యార్థి. కాలేజీలో ప్రియాంక (అర్చనా కవి)తో ప్రేమలోపడతాడు. నాలుగో సంవత్సరం పూర్తయ్యేసరికి అన్ని సబ్జెక్టుల్లోనూ తప్పుతాడు. అదే సమయంలో ప్రియాంక అమెరికా వెళ్లిపోతుంది. కార్తీక్‌ నిరాశలో ఉన్న సమయంలో చైత్ర (పియా బాజ్‌పాయ్‌) పరిచయం అవుతుంది. ఈ ఇద్దరి ప్రేమాయణం సాగుతున్న సమయంలో ప్రియాంక మళ్లీ కార్తీక్‌ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏమైందనేది మిగిలిన కథ.

పరీక్షల్లో ఫెయిలైనంత మాత్రాన జీవితంలో ఫెయిలయినట్లు కాదనే ఆలోచన నుంచి, అతని జీవితం ప్రేరణతోటే 'బ్యాక్‌బెంచ్ స్టూడెంట్' తీశాను. పదహారు సబ్జెక్టుల్లో ఫెయిలై, ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళ్లిపోతే, రెండోసారి ప్రేమలో పడ్డ కుర్రాడి జీవితంలోకి తిరిగి మొదటి ప్రేమికురాలు వస్తే ఏం జరిగిందనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. ఇందులో హీరో పేరు కార్తీక్ అనే పెట్టాను. యు.ఎస్. వెళ్లిపోయే మొదటి ప్రేమికురాలుగా అర్చనా కవి, రెండో ప్రేమికురాలుగా పియా బాజ్‌పేయి నటించారు.

ఇంజనీరింగ్ కాలేజీల దుస్థితినీ, వాటి వెనుక ఉండే రాజకీయ కోణాల్నీ విశ్లేషిస్తూ నా మిత్రుడు, ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ రాసిన 'రివల్యూషన్ 2020' ప్రేరణ కూడా ఈ సినిమా వెనుక ఉంది. ఇంటర్మీడియేట్, ఇంజనీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులు బాగా కనెక్టయ్యే కథ. ఐఐటిలో చదువుకున్న నేనూ బ్యాక్‌బెంచ్ స్టూడెంట్‌నే. కార్తీక్ పాత్రతో తెలుగుకు హీరోగా పరిచయమవుతున్న మహత్ కూడా కాలేజీలో బ్యాక్‌బెంచ్ స్టూడెంటే. కార్తీక్‌లా మహత్ నటించలేదు, ప్రవర్తించాడు. అర్చన, పియా కూడా అంతే. సునీల్ కశ్యప్ ఇచ్చిన ట్రెండీ మ్యూజిక్ సినిమాకి ఎస్సెట్. 'ఇంజనీరింగ్ అంటూ ఏదో ఫీలింగ్.. చేసే చింతపండు ఉద్యోగం కోసం డైలీ డ్రీమింగ్' అనే పాట బాగా పాపులర్ అయ్యింది. తమిళ హీరో శింబు, 'కొలవెరి డి' పాటకు బాణీలిచ్చిన అనిరుధ్ తలో పాట పాడటం ప్రత్యేకాకర్షణ.

సమర్పణ: మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్
సంస్థ: షిర్డీ సాయి కంబైన్స్‌
నటీనటులు: మహత్‌ రాఘవేంద్ర, పియాబాజ్‌పాయ్‌, అర్చనా కవి, అలీ, బ్రహ్మానందం, శరత్‌ బాబు, ప్రగతి, ఇన్సీ గుత్తా, చిన్మయి తదితరులు.
మాటలు: లక్ష్మీభూపాల్‌,
సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌.జి.కె,
సంగీతం: సునీల్‌కాశ్యప్‌,
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మధుర శ్రీధర్‌.
నిర్మాత: ఎమ్‌.వి.కె.రెడ్డి
విడుదల: శుక్రవారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X