మధుర శ్రీధర్ ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ టాకేంటి?

ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రేమాయణం నేపథ్యంలో యువతరాన్ని ఆకట్టుకునే విధంగా సినిమాను తెరకెక్కించామని దర్శక నిర్మాతలు ముందునుండీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. సినిమా ఆద్యంతం బోరింగ్‌గా ఉండటం, నేరేషన్ స్లోగా ఉండటం చాలా మందిని నిరాశ పరిచింది.
మరో వైపు సినిమాలో ఎంటర్ టైన్మెంట్ పాళ్లు కూడా తక్కువగానే ఉన్నాయి. అయితే నటన విషయంలో మహత్ రాఘవేంద్ర, పియా, అర్చన బాగా చేసారు. టెక్నికల్ అంశాల విషయంలో మ్యూజిక్ పర్వాలేదు. అయితే ఎడిటింగ్ మరింత మెరుగ్గా ఉండాల్సింది. ఇతర అంశాలు ఫర్వాలేదు. విషయం కొత్తగా లేక పోవడం, స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్ గా లేక పోవడం ఈ సినిమాకు మరో మైనస్. మరి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రాన్ని ఎంవికె రెడ్డి నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ప్రసాద్ జికె సినిమాటోగ్రాఫీ అందించారు.


Click it and Unblock the Notifications











