‘మహర్షి’కి షార్ట్ బ్రేక్ ఇచ్చి మహేష్ బాబు... త్రివిక్రమ్ గురించి ఇంట్రెస్టింగ్ ట్వీట్!

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో సినిమా రావాలని అభిమానులు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. కానీ సరైన కథ కుదరక పోవడంతో త్రివిక్రమ్- సూపర్ స్టార్‌ కాంబినేషన్లో సినిమా సెట్టవ్వడం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో 2010లో వచ్చిన 'ఖలేజా' ప్లాప్ కావడంతో అప్పటి నుంచి వీరు మళ్లీ కలిసి మూవీ చేయలేదు.

సినిమా చేయక పోయినా మహేష్ బాబు, త్రివిక్రమ్ మధ్య ఫ్రెండ్షిప్ అలాగే ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు పలు యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. తాజాగా వీరి కాంబినేషన్లో మరో యాడ్ ఫిల్మ్ చిత్రీకరణ జరుగుతోంది.

మహర్షి'కి షార్ట్ బ్రేక్ ఇచ్చి... త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు బిజీ

మహర్షి'కి షార్ట్ బ్రేక్ ఇచ్చి... త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు బిజీ

మహేష్ బాబు పలు కార్పొరేట్ బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక కొత్త యాడ్ ఫిల్మ్‌లో సూపర్ స్టార్ నటిస్తున్నారు. ఇందుకోసం ‘మహర్షి'కి చిన్న బ్రేక్ ఇచ్చారట.

నా ఫేవరెట్ డైరెక్టర్ అంటూ మహేష్ బాబు ట్వీట్

యాడ్ ఫిల్మ్ షూట్‌కు సంబంధించిన వర్కింగ్ స్టిల్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ... ‘బ్యాక్ విత్ మై ఫేవరెట్ డైరెక్టర్.. ఆయనతో పని చేయడం అంటే ఎప్పుడూ ఇష్టమే' అని పేర్కొన్నారు. మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మీ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నాం

మీ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నాం

మహేష్ బాబు చేసిన ట్వీట్ మీద అభిమానులు స్పందిస్తూ... ‘మీ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నాం' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా మీ కాంబో మూవీ చూడాలని ఉందంటూ తమ మనసులోన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మహర్షి

మహర్షి

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘మహర్షి' విషయానికొస్తే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, పివిపి, అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేష్ బాబు కెరీర్లెనే ది బెస్ట్ మూవీగా ఇది ఉంటుందని అంటున్నారు.

మహేష్ బాబు ఫారిన్ ట్రిప్

మహేష్ బాబు ఫారిన్ ట్రిప్

త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న యాడ్ ఫిల్మ్ షూటింగ్ ముగిసిన తర్వాత ‘మహర్సి' ఫార్మాలిటీస్ కంప్లిటీ చేయబోతున్నారు మహేష్. అనంతరం ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత ‘మహర్షి' ప్రమోషన్లలో పాల్గొంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X