Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’రిలీజ్ తేదీ ఖరారు
చిత్ర దర్శకుడు మధుర శ్రీధర్ మాట్లాడుతూ- కాలేజీ చదువులు పూర్తయ్యక ఓ బాక్ బెంచ్‌లో కూర్చునే కుర్రాడు కుటుంబ పరంగా, వృత్తిపరంగా ప్రేమ పరంగా ఎదుర్కొన్న అనేక అడ్డంకుల సమాహారమే ఈ చిత్రం కథని తెలిపారు. ఎన్ని ఇబ్బందులెదురైనా నవ్వుతూ ఎదుర్కొనే మంచి స్టూడెంట్ కథ ఇదని హీరో పాత్ర సరికొత్తగా ఉంటుందని, సునీల్ కాశ్యప్ మంచి సంగీతం అందించారని ఆయన వివరించారు.
చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'కాలేజీ జీవితంలో పదహారు సబ్జెక్ట్సలో ఫెయిలై, గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకొని నిరాశగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ విద్యార్థి తన వైఫల్యాలన్నింటినీ చిరునవ్వుతో అధిగమించి జీవిత పయనంలో విజయపథంలోకి ఎలా అడుగుపెట్టాడన్నదే ఈ చిత్ర కథాంశం అన్నారు. స్నేహగీతం ఇట్స్ మై లవ్‌స్టోరీ చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. షిరిడీ సాయి కంబైన్స్ పతాకంపై ఎమ్.వి .కె.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ 'వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 90 శాతం చిత్రీకరణ పూర్తిచేశాం. దర్శకుడు మధుర శ్రీధర్ వాస్తవికతను ప్రతిబింబిస్తూ సహజత్వానికి దగ్గరగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు' అన్నారు. బ్రహ్మానందం, ఆలీ, శరత్‌బాబు, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీభూపాల్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్.జి.కె, సంగీతం: సునీల్‌కాశ్యప్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మధుర శ్రీధర్.