twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’రిలీజ్ తేదీ ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్: మహత్ రాఘవేంద్ర, పియా బాజ్‌పాయ్, అర్చన కవి నటించిన చిత్రం 'బ్యాక్ బెంచ్' స్టూడెంట్ . వాడి బ్రేకప్ లవ్‌స్టోరీ అనేది ఉపశీర్షిక. మధుర శ్రీధర్ దర్శకుడు. మల్టీ డైమన్షన్ ప్రై.లి సమర్పిస్తోంది. షిరిడీ సాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె.రెడ్డి నిర్మించారు. ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

    చిత్ర దర్శకుడు మధుర శ్రీధర్ మాట్లాడుతూ- కాలేజీ చదువులు పూర్తయ్యక ఓ బాక్ బెంచ్‌లో కూర్చునే కుర్రాడు కుటుంబ పరంగా, వృత్తిపరంగా ప్రేమ పరంగా ఎదుర్కొన్న అనేక అడ్డంకుల సమాహారమే ఈ చిత్రం కథని తెలిపారు. ఎన్ని ఇబ్బందులెదురైనా నవ్వుతూ ఎదుర్కొనే మంచి స్టూడెంట్ కథ ఇదని హీరో పాత్ర సరికొత్తగా ఉంటుందని, సునీల్ కాశ్యప్ మంచి సంగీతం అందించారని ఆయన వివరించారు.

    చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'కాలేజీ జీవితంలో పదహారు సబ్జెక్ట్‌‌సలో ఫెయిలై, గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ చేసుకొని నిరాశగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ విద్యార్థి తన వైఫల్యాలన్నింటినీ చిరునవ్వుతో అధిగమించి జీవిత పయనంలో విజయపథంలోకి ఎలా అడుగుపెట్టాడన్నదే ఈ చిత్ర కథాంశం అన్నారు. స్నేహగీతం ఇట్స్‌ మై లవ్‌స్టోరీ చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. షిరిడీ సాయి కంబైన్స్‌ పతాకంపై ఎమ్‌.వి .కె.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    నిర్మాత మాట్లాడుతూ 'వైజాగ్‌, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 90 శాతం చిత్రీకరణ పూర్తిచేశాం. దర్శకుడు మధుర శ్రీధర్‌ వాస్తవికతను ప్రతిబింబిస్తూ సహజత్వానికి దగ్గరగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు' అన్నారు. బ్రహ్మానందం, ఆలీ, శరత్‌బాబు, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీభూపాల్‌, సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌.జి.కె, సంగీతం: సునీల్‌కాశ్యప్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మధుర శ్రీధర్‌.

    English summary
    Backbench Student is the new film made by director Madhura Sridhar who has made films like Snehagitam and Its My Love Story in the past. The film stars actors like Mahat Raghavendra, Pia Bajpai and Archana Kavi in the lead. As the title suggests the film is youthful entertainer targeted at the students.Backbench Student is produced by Munna Venkata Krishna Reddy on the banner "Shirdi Sai Combines". The makers are looking at releasing the film on March 15 according to sources.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X