Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’రిలీజ్ ఎప్పుడు
''కళాశాల జీవితానంతరం ఓ 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్' వృత్తిపరంగా, ప్రేమ పరంగా, కుటుంబ పరంగా ఎదుర్కొన్న పలు సమస్యల సమాహారమే మా సినిమా. సునీల్ కశ్యప్ మంచి సంగీతం అందించారు. కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని నా నమ్మకం'' అని దర్శకుడు మధుర శ్రీధర్ చెప్తున్నారు.
చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'కాలేజీ జీవితంలో పదహారు సబ్జెక్ట్సలో ఫెయిలై, గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకొని నిరాశగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ విద్యార్థి తన వైఫల్యాలన్నింటినీ చిరునవ్వుతో అధిగమించి జీవిత పయనంలో విజయపథంలోకి ఎలా అడుగుపెట్టాడన్నదే ఈ చిత్ర కథాంశం అన్నారు. స్నేహగీతం ఇట్స్ మై లవ్‌స్టోరీ చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. షిరిడీ సాయి కంబైన్స్ పతాకంపై ఎమ్.వి .కె.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ 'వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 90 శాతం చిత్రీకరణ పూర్తిచేశాం. దర్శకుడు మధుర శ్రీధర్ వాస్తవికతను ప్రతిబింబిస్తూ సహజత్వానికి దగ్గరగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు' అన్నారు. బ్రహ్మానందం, ఆలీ, శరత్‌బాబు, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీభూపాల్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్.జి.కె, సంగీతం: సునీల్‌కాశ్యప్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మధుర శ్రీధర్.